పేదల పాలిట.. ఆశా దీపం ఎన్టీఆర్ అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో ఇటీవల వరదల కారణంగా చనిపోయిన 48 కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష రూపాయల చోప్పున చెక్కులను అందించారు నారా భువనేశ్వరి. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి…మాట్లాడుతూ… రాయలసీమలో ఇటీవల కురిసిన వర్షాలకు అనేక మంది నష్టపోయారని.. అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్ మెమోరియల్…
మత్తులో జరిగే హత్యలన్ని ప్రభుత్వ హత్యలేనని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత అన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. మద్యపానం నియంత్రణ కోసం రెండున్నరేళ్లలో ఏమి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైన్ షాపుల్లో దొరుకుతున్న చీప్ లిక్కర్‌ను తాగి రెండేళ్లుగా ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకున్నారన్నారు. మూడు దశల్లో మద్యపాన నియంత్రణ చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఎందుకు మడమ…
ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు తర్వాతే హైదరాబాద్ భౌగోళిక స్వరూపం మారిపోయింది. నగర విస్తరణ, అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్డు అవసరం అని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. అమరావతి రాజధాని, దాని చుట్టూ వున్న విజయవాడ,గుంటూరును కలుపుతూ 189కి.మీ ఔటర్ రింగ్ రోడ్డు రూపకల్పన జరిగింది. 17761కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి కేంద్రం ఆమోదించింది. అటువంటి ప్రాజెక్ట్ ను వైసీపీ ప్రభుత్వం అటకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓఆర్ఆర్ ను మంగళం పడేశారని కేంద్ర మంత్రి నీతిని…
ఆ జిల్లాలో టీడీపీ నేతలు ఎక్కువే. రాష్ట్ర, ఢిల్లీ స్థాయిల్లో పనిచేసిన అనుభవం ఉన్నవాళ్లే. కాకపోతే.. ఒకరంటే ఇంకొకరికి పడదు. పైకి నవ్వుతారు.. తెరవెనక కత్తులు దూసుకుంటారు. ఎప్పుడు కలిసి పోతారో తెలియదు.. ఎందుకు విడిపోతారో కూడా గుర్తించలేం. ప్రస్తుతం ఆ జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆసక్తికర వార్ జరుగుతోంది. అదే పార్టీలో పెద్ద చర్చ…రచ్చ..! పార్టీని బలహీనపర్చడానికే నేతలు కష్టపడుతున్నారా? టీడీపీలో క్రమశిక్షణ కనుమరుగవుతోందా? ఒక్క సీటూ గెలవలేని జిల్లాలో ఎవరేం చేసినా అధిష్ఠానానికి…
నలుగురు ఎమ్మెల్యేలు.. 14 మంది ఇంఛార్జులు. వీరిలో కొందరు కనిపించరు.. మరికొందరు టచ్‌మీ నాట్‌గా ఉంటారు. గాలి తగ్గి సైకిల్ పంక్చరయ్యే పరిస్థితులు ఉన్నా పట్టించుకోవడం లేదట. అందరూ గాలి కోసం ఎదురు చూస్తున్నారే తప్ప.. సైకిల్‌కి గాలికొట్టే ప్రయత్నాలే లేవట. ఆ జిల్లా ఏంటో.. అక్కడ నాయకులు ఎందుకలా ఉన్నారో ఈ స్టోరీలో చూద్దాం. ఎమ్మెల్యేలు.. ఇంఛార్జులు టీడీపీని పట్టించుకోవడం లేదట..! తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ జోరు తగ్గిందా? వరస ఓటములు తమ్ముళ్లను నిరుత్సాహ…
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి సొంత పార్టీలోనే సెగ మొదలైందా..? కొందరు టీడీపీ నేతలే ఆయనకు పక్కలో బల్లెంలా తయారయ్యారా..? అందుకే ఉలిక్కిపడి వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నారా..? ఇంతకీ పుట్టపర్తిలో పల్లెకు వచ్చిన కష్టమేంటి? పుట్టపర్తి టీడీపీలో పల్లెకు సెగ మొదలైందా? పల్లె రఘునాథరెడ్డి. మాజీ మంత్రి. అనంతపురం జిల్లా టీడీపీలో సీనియర్. విద్యావేత్తగా ఉన్న ఆయన టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా.. ఎమ్మెల్సీగా.. మంత్రిగా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు పల్లె. రెడ్డి…
ఏపీ అభివృద్ధి కోసమే సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని హోంమంత్రి సుచరిత వెల్లడించారు. అమరావతిని రాజధానిగా టీడీపీ ప్రభుత్వం ప్రకటించి, కేవలం తాత్కాలిక భవనాలు మాత్రమే నిర్మించిందన్నారు. అమరావతిపై బీజేపీ వైఖరి కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో మరోలా ఉందన్నారు. 3 రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోనిదని కేంద్రమే చెప్పిందని సుచరిత చెప్పారు. Read Also: జనసేన ‘డిజిటల్’ ఉద్యమం ప్రారంభం.. స్పందన లభించేనా? కానీ ఇక్కడ మాత్రం అమరావతి రాజధానిగా ఉండాలని బీజేపీ చెబుతోందన్నారు.…
ఏపీలో రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనెక్కర్లేదు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా పోటీ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీలకే ఉంటుంది. వార్డు మెంబర్ ఎన్నిక నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకు టీడీపీ, వైసీపీ నేతల మధ్య అసలైన పోరు ఉంటుంది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ పౌరులకు తెలియంది కాదు. అయితే రాష్ట్ర విభజన తరువాత మొదటి సారి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను నవ్యాంధ్ర ప్రదేశ్‌గా ఎన్నో హంగులతో…
అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ చేపట్టిన 45 రోజుల మహాపాదయాత్ర ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు తిరుపతిలో రాజధాని రైతులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ నేతలు హజరయ్యారు. అంతేకాకుండా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు కూడా హజరయ్యారు. అయితే ఈ సభకు హజరయ్యేందుకు చంద్రబాబు కూడా తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారిని దర్శించుకొని రైతులు నిర్వహిస్తున్న మహాసభ ప్రాంగణానికి…
అధికారం కోల్పోయిన రెండున్నరేళ్ల తర్వాత ఆ నియోజకవర్గంలో ఓ ప్రయోగం చేసింది టీడీపీ. మాజీ ఎమ్మెల్యేను తప్పించి నియోజకవర్గ బాధ్యతలను మరోనేత చేతుల్లో పెట్టింది. గ్రౌండ్లో మాత్రం సీన్ మరోలా ఉందట. ఓ మాజీ మంత్రి కుమారుడు అక్కడ కన్నేయడంతో రాజకీయం రసకందాయంలో పడిందట. టీడీపీ అంతర్గత రాజకీయాలు గవిరెడ్డిని ఓడించాయా? విశాఖజిల్లా మాడుగుల. ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం తర్వాత ఆరుసార్లు ఇక్కడ పసుపు జెండానే ఎగిరింది. 2009లో రాష్ట్రంలో అధికారాన్ని…