Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు త్యాగం అంటే.. పవన్‌ని సీఎం చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పొత్తు రాజకీయాలపై వాడీవేడీ చర్చలు కొనసాగుతున్న తరుణంలో.. ప్రభుత్వం సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ చెప్తున్న డైలాగులన్నీ చంద్రబాబువి అని చెప్పారు. పవన్ ఏదో వ్యూహం అంటున్నారు, ఇంతకీ వ్యూహం అంటే ఏంటి? అని ప్రశ్నించారు. ‘‘ఒకరేమో త్యాగాలకు సిద్ధమంటారు, మరొకరు నేనే సీఎం అంటారు, ఇంకొకరు మేం కలవమంటారు, అసలు విపక్ష పార్టీలకు వారిలో వారికే స్పష్టత లేదు’’ అని ఎద్దేవా చేశారు.
ఎన్నికల సమయంలో పొత్తులు పెట్టుకోవడం కరెక్ట్ కాదని, అసలు పొత్తులు పెట్టుకోవడమంటే అదేదో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నట్టు మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదని సజ్జల సెటైర్ వేశారు. పవన్, చంద్రబాబు పొత్తులోనే ఉన్నారని.. చంద్రబాబు కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌లోనే పవన్ నడుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు త్యాగం చేస్తానంటున్నారు, అదే సమయంలో లీడ్ చేస్తానని చెప్తున్నారు.. మరోవైపు జనసేన అధికారంలోకి వస్తే నేనే సీఎం అవుతానంటూ పవన్ అంటున్నారు.. మరి రాష్ట్రానికి ఇద్దరు సీఎంలు ఎందుకో అర్థం కావడం లేదని సజ్జల వ్యాఖ్యానించారు.
Also Read
- Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
- Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
- IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
ఇంతకీ చంద్రబాబు త్యాగం అంటే ఏమిటి? త్యాగం అంటే పవన్‌ని సీఎం చేస్తారా? చంద్రబాబు లీడ్ చేయడమే త్యాగమా? అంటూ సజ్జల ప్రశ్నించారు. ఇప్పటివరకూ చంద్రబాబు ఎన్ని జంప్‌లు చేశారో అందరికీ తెలుసని, వీళ్ళు జనాల్ని ఫూల్స్ చేస్తున్నారని అన్నారు. విపక్షాలన్నీ ఊహా ప్రపంచంలో నివసిస్తున్నారేమోనని అనిపిస్తోందంటూ కౌంటర్స్ వేశారు. ఆల్రెడీ ప్రజల్లో ఉన్న తాము, త్వరలోనే గడప గడప కార్యక్రమంతో ప్రజల గడపల్లోకి వెళ్తున్నామని.. దాన్ని ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నారని సజ్జల రామకృష్ణ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత ‘రామలక్ష్మి’ పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
-
CMR Jewellery: గాజువాకలో CMR జువెలరీ షోరూం.. ఘనంగా ప్రారంభించిన భాగ్యశ్రీ బోర్సే.!
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
ట్రెండింగ్
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!