ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. బాదుడే బాదుడు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లాల్లో పర్యటించిన ఆయన.. జిల్లాల పర్యటనకు వచ్చిన ప్రజా స్పందన అద్భుతం అంటూ ట్వీట్ చేశారు. 7 జిల్లాలలోని 21 నియోజకవర్గాల్లో లక్షల మందికి చేరువగా పర్యటన సాగిందన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ బాదుడే బాదుడుపై ప్రజల అభిప్రాయాలు, అవేదన, ఆగ్రహం రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యతిరేకతను చాటాయని.. ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో ప్రజలు మార్పును కోరుకుంటున్న తీరు స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు చంద్రబాబు.
Read Also: Balka Suman: కాంగ్రెస్ సభపై బాల్క సుమన్ సెటైర్లు.. అది మానసిక సంఘర్షణ సభ..!
తెలుగు తమ్ముళ్లలో కసి, ప్రజల్లో తెలుగుదేశం పార్టీపై ఆసక్తి రానున్న మార్పును సూచిస్తున్నాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు.. వాడవాడలా వెల్లువలా కదిలి, అర్థరాత్రి సైతం ఎదురేగి స్వాగతం పలికిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు.. ఒక్క మాటలో చెప్పాలంటే. ఈ టూర్ కు వచ్చిన ప్రజా స్పందన రాష్ట్రానికే ఒక సందేశం ఇచ్చిందని తన ట్వీట్‌లో పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు. కాగా, ఏపీలో పెరిగిన చార్జీలకు వ్యతిరేకంగా బాదుడే బాదుడు పేరుతో తెలుగుదేశం పార్టీ ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
మూడు రోజుల నా జిల్లాల పర్యటన ఎంతో అద్భుతంగా సాగింది. 7 జిల్లాలలోని 21 నియోజకవర్గాల్లో లక్షల మందికి చేరువగా పర్యటన సాగింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ 'బాదుడే బాదుడు' పై ప్రజల అభిప్రాయాలు, ఆవేదన, ఆగ్రహం రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యతిరేకతను చాటాయి.(1/3) pic.twitter.com/xm5YCamw8F
— N Chandrababu Naidu (@ncbn) May 7, 2022