ఏపీ టీడీపీ ప్రైవేట్ క్లాసులు… ఇద్దరు ట్యూషన్ మాస్టర్లు! |
- Follow Us :
-
-
Add as a preferred
source on google
40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీ… ఇప్పుడు ట్యూషన్ పెట్టించుకుని రాజకీయ పాఠాలు చెప్పించుకుంటోంది. అదీ ఒక్కరితో కాదు.. ఇద్దరితో. ఇప్పుడంతా పొలిటికల్ స్ట్రాటజిస్టుల ట్రెండ్ నడుస్తోంది. వ్యూహకర్తలు ఉంటే గెలుపు తీరాలకు చేరొచ్చనే భావన జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో బలంగా ఉంది. ఆ క్రమంలోనే టీడీపీ సైతం స్ట్రాటజిస్టులకు పార్టీని అప్పజెప్పింది. ముందుగా రాబిన్‌శర్మ టీమ్‌కు బాధ్యతలు అప్పగించారు. తాజాగా మరో స్ట్రాటజిస్ట్ కనుగోలు సునీల్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనే తెలంగాణలో కాంగ్రెస్‌కు కూడా వ్యూహకర్తగా పని చేస్తున్నారు. వీరిద్దరు ప్రస్తుతం టీడీపీని గాడిలో పెట్టే పనిలో ఉన్నారట.
టీడీపీ హయ్యర్ సర్కిల్స్‌లో ఇద్దరు స్ట్రాటజిస్టుల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. వీరిలో చాలామందికి తమ నియోజకవర్గాల్లో.. జిల్లాల్లో ఏం జరుగుతుంది..? గ్రౌండ్ రియాల్టీ ఏంటనేది స్పష్టంగా తెలుసు. ఇక చంద్రబాబు విషయానికొచ్చేసరికి.. ఆయనే అతిపెద్ద స్ట్రాటజిస్టు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో టీడీపీకి కావాల్సింది అధినాయకత్వంపై నమ్మకాన్ని కలిగించడం. ఇంఛార్జుల ఎంపిక.. అభ్యర్థుల ఖరారులో జాగ్రత్తలు తీసుకోవడమే. వీటి విషయాల్లో గ్రౌండ్‌లో ఉన్న పరిస్థితేంటీ..? ఎవరికి సీటిస్తే.. ఎలాంటి రియాక్షన్ వస్తుంది..? ఎవరిని ఇన్‌ఛార్జీగా నియమిస్తే సెగ్మెంట్‌లో పార్టీ పుంజుకుంటుందనే విషయాన్ని విశ్లేషించి తగిన ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సిన బాధ్యత స్ట్రాటజిస్టులదే. కానీ వ్యూహకర్తలు ఆ పని చేయడం లేదట. పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని.. పార్టీ ఎక్కడా కరెక్ట్‌లైన్‌లో వెళ్లడం లేదనే చర్చ పార్టీ వర్గాల్లో ఉందట.
Also Read
- Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
- OTR: పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..? కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశామా అంటున్నారా..?
- Off The Record: ముద్రగడ సంస్మరణ సభకు టీడీపీ నేతలు వెళ్తారా..? తెలుగు తమ్ముళ్లలో కొత్త టెన్షన్
- OTR : తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీకి ఢిల్లీ పిలుపు..రేవంత్ టీమ్‌లో హైటెన్షన్ ఎందుకు?
పార్టీ ఇన్‌ఛార్జుల నియామకంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను ప్రస్తావిస్తున్నారు టీడీపీ నాయకులు. తాజాగా చీరాల ఇన్ఛార్జీగా కొండయ్య యాదవ్‌ను నియమించారు. ఆయన నియామకం అక్కడ సరైంది కాదన్నది పార్టీలో వాదన ఉందట. చీరాలలో యాదవ సామాజికవర్గానికి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు ఉండటం.. ఆ సామాజికవర్గలో చెప్పుకోదగ్గ నాయకుడు లేకపోవడంతో కొండయ్య వైపు మొగ్గు చూపినట్టు చెబుతున్నారు. అయితే పార్టీలో ఆయన ట్రాక్ రికార్డు అంత గొప్పగా లేదన్నది .. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారితో కలిసి గతంలో కొండయ్య తిరిగినట్టు ఆరోపిస్తున్నారు. ఇదే తరహాలో బాపట్ల వచ్చిన ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అక్కడ ఇంఛార్జ్‌గా వేగేశ్న నరేంద్ర వర్మ పేరు ప్రకటించడాన్ని పార్టీ వర్గాలు తప్పుపడుతున్నాయట. ఈ అంశాలపై ఎవరి వాదన వారిదే. ఇవన్నీ వ్యూహకర్తలు చెబితే చెస్తున్నారా? లేక వారితో సంబంధం లేకుండా చేస్తున్నారా అనేది అంతుచిక్కడం లేదట. వీటిపై వ్యూహకర్తలు పార్టీని ఎందుకు అలర్ట్ చేయడం లేదని ప్రశ్నించేవాళ్లూ ఉన్నారు.
వాస్తవానికి స్ట్రాటజిస్టులు.. పార్టీకి సంబంధించిన కీలకమైన.. సున్నితమైన అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. రాబిన్ శర్మ కానీ.. సునీల్ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. వైసీపీ తరహాలో సంస్ధాగతంగా టీడీపీని పటిష్టం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా? గ్రామస్థాయిలో టీడీపీ జెండా పట్టుకుని తిరిగే నాయకులు ఉన్నారు. కేడర్ బేస్డ్ పార్టీ. అలాంటి టీడీపీలో అభ్యర్థుల ఎంపిక.. ఇంఛార్జుల నియామకాల్లో జాగ్రత్తలు తీసుకోవడం.. చంద్రబాబు, లోకేష్‌ల ఇమేజ్ ఎలివేట్ అయ్యేలా వ్యహ రచన చేయడం కీలకమన్నది పార్టీ నేతల అభిప్రాయం. లోకేష్ ఇమేజ్ గతానికంటే మిన్నగా ఉందన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. చంద్రబాబు ఇమేజ్‌లో గతానికి.. ఇప్పటికీ ఏ మాత్రం తేడా లేదని అనుకుంటున్నారు. మరి ఇద్దరు ట్యూషన్ టీచర్లు ఏం చేస్తున్నారు అనేది టీడీపీ నేతల ప్రశ్న. నిరసన కార్యక్రమాలు చేపట్టం మినహా పొలిటికల్ అనాలిసిస్.. గ్రౌండ్ రియాలిటీలతో స్ట్రాటజీలు వేయడం లేదట. అందుకే ఇద్దరు ప్రైవేట్ మాస్టర్లు.. టీడీపీని ముంచుతారా.. తేలుస్తారా అని కేడర్ ఆందోళన చెందుతున్నారట.
తాజావార్తలు
-
Brahma Muhurat: “బ్రహ్మ ముహూర్తం”లో రామాయణ ట్రైలర్.. ఈ ముహూర్తం విశిష్టత ఏమిటి.?
-
Ajay Bhupathi: మహేష్ బాబు ఫ్యామిలీ హీరోతో సినిమా.. ఎందుకో చెప్పిన డైరెక్టర్ అజయ్ భూపతి!
-
Demonetisation Fraud Case: పాత నోట్ల మార్పిడి కేసులో సంచలన తీర్పు.!
-
Karnataka: షాకింగ్ పరిణామం.. 7 వేల మంది కాలేజీ విద్యార్థులకు ఎయిడ్స్ నిర్ధారణ
-
BMW Layoffs: భారీగా లేఆఫ్స్ ప్రకటించిన బీఎమ్‌డబ్ల్యూ.. 8000 మంది ఇంటికే..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!