Minister Anagani: స్వర్ణాంధ్ర విజన్- 2047లో భాగంగా డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్(DVAPU) పీ4 కార్యక్రమంపై జరిగిన సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్-1 గా ఉండేలా సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ కు రూపకల్పన చేశాడని తెలిపారు. జీరో పావర్టీ దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం.. చరిత్రలో ఎన్నడు లేని విధంగా జిల్లా, నియోజకవర్గ విజన్ డెవలప్మెంట్ ప్రణాళికలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా, నియోజకవర్గ విజన్ ప్లాన్ రూపకల్పనలో ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అని మంత్రి అనగాని సూచించారు.
Read Also: KTR: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
అయితే, వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమ, సర్వీస్ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలి అని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. అలాగే, తిరుపతి జిల్లాను రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలబెట్టాలి అని కోరారు. పీ-4 కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలను గుర్తించి ఆగస్టు 15వ తేదీలోపు వారిని ఆదుకునే చర్యలు చేపడతాం అన్నారు. మార్గ దర్శకాలను గుర్తించి వారి ద్వారా బంగారు కుటుంబాలను ఆదుకోనున్నాం.. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే వరకు చర్యలు తీసుకునేలా ప్రణాళిక రెడీ చేశామని మంత్రి సత్యప్రసాద్ వెల్లడించారు.
Read Also: Prabhas: 300 కోట్ల తమిళ సినిమా డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా?
ఇక, ఈ కార్యక్రమం కోసం ప్రతి నియోజకవర్గంలోనూ అనుసంధాన కార్యకర్తలను ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రజాహితం కోరే ప్రభుత్వం.. విధ్వంస పాలనను అధిగమించి సుపరిపాలన చేపడుతున్నాం.. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని కలుస్తున్నాం.. ప్రజల స్పందన తెలుసుకొని అడుగులు వేస్తామని చెప్పుకొచ్చారు. 2018లో తెలుగుదేశం ప్రభుత్వమే మామిడి రైతులను ఆదుకుంది.. మరలా ఇప్పుడు కూడా ఎన్నడు లేని విధంగా కేజీకి నాలుగు రూపాయల చొప్పున తోతాపురి మామిడి రైతులకు సబ్సిడీని అందిస్తున్నామని సత్యప్రసాద్ చెప్పారు.