Botsa Satyanarayana: కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ వాగ్దానాలు ఎందుకు అమలు చేయడం లేదని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పథకాల గురించి అడిగితే మక్కెలు విరగకొడతాం, తాట తీస్తాం అంటూ బెదిరింపులకు దిగుతున్నారని చెప్పుకొచ్చారు. గ్రామాల్లో తిరగండి ఎవరికి మక్కెలు విరగకొడతారో తెలుస్తుంది.. మాయ మాటలు చెప్పేవాళ్ళను మోసగాళ్ళని అనాలా లేదా అని మాజీమంత్రి బొత్స పేర్కొన్నారు.
Read Also: Patancheru: ఫ్యాన్ కు టవల్ వేసుకొని ఊయల ఊగిన చిన్నారి.. పవర్ రావడంతో ఘోరం
ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం అయిన ఇచ్చిందా? అని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలు, రైతులు మోసపోతారు అని ఆరోపించారు. అయితే, చంద్రబాబు వంద అబద్దాలు చెబితే.. ఆయన కుమారుడు నారా లోకేష్ రెండు వందల అబద్దాలు చెబుతాడు అని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.