కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ను జైలుకు పంపాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు.
లిక్కర్ స్కామ్‌పై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం ద్వారా సంపాదించిన సొమ్ముతో బంగారం కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్, సినిమాలు తీయడం, జింబాబ్వే, టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో మైనింగ్‌పై పెట్టుబడులు పెట్టారన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది కూటమి ప్రభుత్వ పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్ళాయపాలెంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వ విధానాలపై… టీడీపీ వర్గాలు కాస్త అసహనంగా ఉన్నాయా? వాస్తవాలకు దూరంగా ఆలోచిస్తున్నట్టు ఫీలవుతున్నాయా? అంశం ఏదైనాసరే… ఆచరణకు ముందే ఊదరగొట్టేస్తే… మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నారా? అర్ధంకాని అండపిండ బ్రహ్మాండాల గురించి కాకుండా… సామాన్యులకు దగ్గరగా మాట్లాడాలన్న సూచనలు వస్తున్నాయా? అసలు ఏయే అంశాల్లో కాస్త ఎక్కువ చేస్తున్నామన్న అభిప్రాయం కేడర్‌లో ఉంది? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదేపదే వినిపిస్తున్నది, ఇంకా చెప్పాలంటే… హోరెత్తిస్తున్న ఒకే ఒక్క పదం క్వాంటం…
CM Chandrababu Warns YS Jagan Over Kovur MLA Controversy: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వ్యక్తిగత జీవితాన్ని ఒక మాజీ ఎమ్మెల్యే విమర్శించాడని.. ఇంతకీ అతను పశువువా, మనిషా అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తానైతే మరోసారి అలాంటివి జరగకుండా చూడాలని మందలించేవాడినని, కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆ మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి పరామర్శించాడని సీఎం మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై కోవూరు మాజీ ఎమ్మెల్యే…
వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై హాట్ కామెంట్లు చేశారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత.. సీఎం చంద్రబాబు బావిలో దూకాలన్న జగన్ కామెంట్లుకు కౌంటర్ ఇచ్చిన ఆమె.. చంద్రబాబు బాయిలో దూకడం కాదు జగన్.. నువ్వు నీరు లేని బావిలో పడ్డా.. నీ పాపాలు పోవు అని వ్యాఖ్యానించారు.. సూట్ కేసు రెడీ చేసుకుని ఉండు... త్వరలో జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పరిటాల సునీత..