Speaker Ayyanna Patrudu: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసెంబ్లీకి వస్తారా..? రారా? క్లారిటీ ఇవ్వండి.. మీ మూలంగా ప్రశ్నలు మురిగిపోతున్నాయని మండిపడ్డారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి.. ముందు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని నిలదీశారు.. ప్రజాస్వామ్య దేవాలయంకు ఆయన ఇచ్చే గౌరవం ఇదేనా? ఆ సభ్యులు ఇచ్చే గౌరవం ఇంతేనా? అంటూ ఫైర్ అయ్యారు.. గత ఐదేళ్లలో అసెంబ్లీలోని ప్రింటర్లు తుప్పు పట్టినట్టే సభ కూడా తుప్పు పట్టింది.. గత ప్రభుత్వంలో అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కూడా తుప్పుపట్టాయి.. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో కేవలం 75 రోజులు పనిదినాలు మాత్రమే నడిచాయి.. భారతదేశంలో ప్రతి అసెంబ్లీ తక్కువలో తక్కువ 60 రోజులు జరగాలి అని పాట్నాలో తీర్మానించాం.. కొత్త ప్రభుత్వంలో ఇప్పటికీ 31 రోజులు సమావేశాలు జరిగాయని తెలిపారు..
ఇక, ఈ నెల 17, 18 నుండి అసెంబ్లీ సమావేశాల ఉండవచ్చు అన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. భారత దేశంలో ఏ పౌరుడు అయినా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే బావుంటుంది.. కానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది అని ఎద్దేవా చేశారు.. గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగాయి.. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తుంది అని మాజీ సీఎం ఎలా అంటారు అని నిలదీశారు.. ఆ రోజు అక్కడ ఒక్క నామినేషన్ వేయలేదు.. టీవీలో చూసాను సీఎంపై అలా మాట్లాడడం ఏంటి? నీకు మెంటల్ వచ్చిందా..? ఇది పద్దతి కాదు అని హితవుచెప్పారు.. అసలు నీ పార్టీ ఎజెండా ఏంటి..? నీ ఆలోచన ఏంటి? అని ప్రశ్నించారు.. గొప్ప నాయకులే ఓడిపోతారు, గెలుస్తారు.. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లాంటి నేతలే ఓడిపోయారు.. కానీ, పులివెందులలో ఎప్పుడైనా ఇన్ని నామినేషన్లు వేసారా? అని ప్రశ్నించారు.. అంతేకాదు, ఇప్పుడు 11 నామినేషన్లు పడ్డాయని గుర్తుచేశారు.. ప్రతి రోజు అసెంబ్లీలో మీ సభ్యుల కోసం 2 ప్రశ్నలు వస్తాయి.. 10 ప్రశ్నల్లో 2 ప్రశ్నలు మీ సభ్యులకు సంఖ్యాపరంగా కేటా ఇస్తాం.. అయితే, వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు.. కానీ, ప్రశ్నించడానికి అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మీ మూలంగా రెండు ప్రశ్నలు వేస్ట్ అవుతున్నాయి.. ఆ రెండు ప్రశ్నలు మీరు రాకపోతే చెప్పండి.. ఆ ప్రశ్నలు మరో పార్టీకి కేటాయిస్తాం అన్నారు..
Read Also: Young Directors : హిట్ ఇచ్చినా కూడా ఖాళీగా ఉన్న యువ దర్శకులు
సభ్యులు అందరూ అసెంబ్లీకి రావాలి అని కోరుతున్న.. మీరు వస్తారా… రారా నాకు క్లారిటీ ఇవ్వండి.. వీటిపై నేను నిర్ణయం తీసుకోవాలి.. మీ వల్ల ప్రశ్నలు మురిగిపోతున్నాయి అని ఫైర్ అయ్యారు స్పీకర్.. అసెంబ్లీలో చాలా కీలకం ప్రింటింగ్ ప్రెస్.. నేను స్పీకర్ గా వచ్చాక ప్రింటింగ్ ప్రెస్ అన్ని తుప్పు పట్టి ఉన్నాయి.. ప్రభుత్వం ఫైనాన్స్ వాళ్లతో మాట్లాడి కొత్త మెషిన్ లు తెచ్చాం.. నూతనం గా వున్న టెక్నాలజీ ఉన్న మెషీన్ తీసుకున్నాం.. నిముషాల్లో కొన్ని వేల పేపర్ లు ప్రింట్ చేసే మెషీన్ ఇది.. ఆటోమేటిక్ మెషీన్ పనిచేస్తుంది. తక్కువ స్థలం లో మెషిన్ పెట్టుకోవచ్చు. దీనితో పాటు కర్నూలులో ఒకటి.. విజయవాడ లో ఒకటి.. ప్రభుత్వ ముద్రణ చేసే ప్రెస్ లు ఉన్నాయి.. అవి తప్పుపట్టు ఉన్నాయి.. వాటిని కూడా రెనోవేట్ చేస్తాం అని ప్రకటించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు..