టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. శాతవాహన కాలేజీ ప్రారంభించి 53 యేళ్లు అయ్యింది.. అనేకమంది పెద్దలు సెక్రటరీ లుగా పని చేశారు.. 2011లో నేను సెక్రటరీగా అయిన సమయంలో ఈ ఆస్తిని లోక్ అదాలత్ లో పెట్టినట్లు వంకాయలపాటి కామేశ్వరరావు, బోయపాటి అప్పారావు మధ్య వివాదం నడిచింది.. ఆ తరువాత ఈ వివాదం సుప్రీంకోర్టు వరకూ కూడా వెళ్లింది.. ఆ తర్వాత శ్రీనివాసరావు, ప్రజాప్రతిరావులు కోర్టులో గెలిచి కూడా పిటిషన్ వెనక్కి…
Perni Nani: కడప జిల్లా పులివెందులలో జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అరాచకాలు, ఆకృత్యాలు జరుగుతున్న పోలీసులకు పట్టడం లేదని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని విమర్శించారు.
Nara Lokesh: గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సమస్యలు అన్ని తెలుసుకున్నా.. చేనేత కార్మికుల ఆదాయం రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. యువగళంలోనే చేనేతను దత్తత తీసుకున్నా.
Minister Satya Prasad: పులివెందుల ప్రజలు రౌడీయిజం మాకు వద్దని కూటమి ప్రభుత్వం వైపు నడుస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రశాంతమైన తిరుపతిలో రౌడీయిజం చేయడం కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించామన్నారు.
Satavahana College: మరోసారి తెరమీదకి శాతవాహన కళాశాల వివాదం వచ్చింది. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తనను బెదిరిస్తున్నారని ఆడియో కాల్ ను మీడియాకు విడుదల చేసి, సీపీకి ఫిర్యాదు చేశారు ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్.
తెలుగుదేశం పార్టీకి తిరుగులేని ఆధిపత్యం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం ఇచ్ఛాపురం. ఇక్కడి నుంచి ఆ పార్టీ తరపున హ్యాట్రిక్ కొట్టారు ఎమ్మెల్యే బెందాళం అశోక్. ప్రస్తుతం ప్రభుత్వ విప్ పదవిలో కూడా ఉన్నారాయన. అయితే... ఇన్నేళ్ళ సంగతి ఎలా ఉన్నా... ఇప్పుడు మాత్రం ద్వితీయ శ్రేణి నాయకులే ఆయన మీద గుర్రుగా ఉన్నారట. అదే సమయంలో ఇన్నిసార్లు గెలిపిస్తే.. నియోజకవర్గానికి ఏం ఒరగబెట్టారు సార్.. అన్న ప్రశ్నలు సైతం ప్రజల నుంచి మొదలవుతున్నాయి.
వైసీపీ మాజీ మంత్రి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే... గుమ్మనూరు జయరాం, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటోంది. పార్టీలు మారినా... వాళ్ళ వివాదాస్పద తీరు మాత్రం మారదా అన్న చర్చలు నడుస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. నిత్య వివాదం లేకుంటే వీళ్ళకు నిద్ర పట్టదా అని కూడా మాట్లాడుకుంటున్నారట.
పులివెందుల వైసీపీ నాయకులతో ఫోన్లో మాట్లాడారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. టీడీపీ దాడిని ఖండించారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డితోనూ ఫోన్లో మాట్లాడారు జగన్.. వీరితో సైదాపురం సురేష్ రెడ్డి (చంటి), అమరేష్ రెడ్డిలతో కూడా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్ధితిపై వాకబు చేశారు.. తమపై టీడీపీ దాడి చేసిన తీరును వివరించారు నేతలు..