TDP Wins in Pulivendula: పులివెందులలో టీడీపీ ఘన విజయం.. డిపాజిట్ కోల్పోయిన వైసీపీ..
- పులివెందుల టీడీపీ వశం..
- జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం..
- 6,052 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు..
- 683 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయిన వైసీపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Wins in Pulivendula: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పులివెందులలో టీడీపీ ఘన విజయం సాధించింది.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో టీడీపీ గెలవడమే కష్టమనే పరిస్థితి నుంచి.. అసలు వైసీపీకి డిపాజిట్ కూడా రాని పరిస్థితి వచ్చింది.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు.. 6,033 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారు.. టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,716 ఓట్లు రాగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 683 ఓట్లు మాత్రమే వచ్చాయి.. దీంతో, టీడీపీ గ్రాండ్ విక్టరీ కొడితే.. వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకుండా పోయింది.. ఇక 30 ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ.. తెలుగుదేశం పార్టీ వశమైంది..
Read Also: Crime News: మైలపోలు తీస్తుండగా పెళ్లి ఆపిన పోలీసులు.. ఆఖరి నిముషంలో ఏం జరిగిందంటే?
Also Read
అయితే, 2016లో తప్ప.. మిగిలిన ఐదుసార్లు వైఎస్ ఫ్యామిలీ పెట్టిన అభ్యర్థులే పులివెందుల జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు.. కానీ, 2016లో నామినేషన్ వేసింది టీడీపీ.. అయితే, పోలింగ్ కు ముందే టీడీపీ అభ్యర్థి.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. కానీ, బ్యాలెట్‌లో సైకిల్ గుర్తు ఉండటంతో టీడీపీకి ఏకంగా 2,500 ఓట్లు వచ్చాయి..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?