పులివెందులలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. లా అండ్ ఆర్డర్ కాపాడుకుంటూ హక్కుల్ని కాపాడుకుంటూ ప్రజలకి భద్రత కల్పిస్తున్నారు.. వైసీపీ నేతలు ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్నారు.. ఈ రోజు దాదాపుగా 100 కోట్లకుపైగా ఖర్చు పెడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు..
వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. పులివెందుల, ఒంటిమిట్ట ఓటర్లు కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు పూర్తిస్థాయి సన్నద్ధంగా ఉన్నారన్న ఆయన.. ఇందులో ఎటువంటి అనుమానము ఎవరికి అవసరం లేదు. వైసీపీ అరాచకాలకు తెరదించుతూ ఈ ఎన్నికల్లో ఓటర్లు తీర్పునివ్వనున్నారు. పూర్తి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ జరుగుతుంటే తమ అరాచకాలు, ఎత్తులు సాగడం లేదని వైసీపీ తీవ్రంగా మదనపడిపోతుందని ఫైర్ అయ్యారు.
కడప జిల్లాలో రెండు జట్పీటీసీ ఉప ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.. ఇటు పులివెందులతో పాటు అటు ఒంటిమిట్ట జడ్పీటీసీ కోసం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది.. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.. అయితే, తెల్లవారుజాము నుంచి టెన్షన్ వాతావరణం నెలకొంది.. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు..
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. జడ్పీటీసీ ఉప ఎన్నిక బ్యాలెట్ రూపంలో జరుగుతుండడంతో కూటమినేతలు భయపడుతున్నారని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి కూటమి ప్రభుత్వం అక్రమ మార్గంలో గెలిచిందని విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో 'ఆడుదాం ఆంధ్రా' పేరుతో ఆటలు నిర్వహించారు.. అయితే, దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.. దీనిపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తి అయ్యింది.. రేపో.. మాపో ఏపీ ప్రభుత్వానికి ఆడుదాం ఆంధ్రాకు సంబంధించిన నివేదిక అందనుంది.. దీంతో, వైఎస్ జగన్ కేబినెట్లో క్రీడా మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా అరెస్ట్ తప్పదా? అనే చర్చ సాగుతోంది..
విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడెవరు ? అధ్యక్షుడి స్థానాన్ని దక్కించుకునేది ఎవరు ? అందరినీ మెప్పించే, నడిపించే సారథిగా ఎవరికి అవకాశం దక్కుతుంది ? కుర్చీని నవతరం అందిపుచ్చుకుంటుందా? పాత సీనియర్లె సారథ్యం వహిస్తారా? ఇప్పుడు ఈ ప్రశ్నలే అక్కడ వినిపిస్తున్నాయి. ఇంతకీలో పోటీలో ఉన్న నాయకులు ఎవరు ?
కడప జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు కాక రేపుతున్నాయి.. పులివెందుల ఈ పేరు చెప్తే అందరికీ గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం... వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలు అన్ని ఏకగ్రీవమే.. 1995, 2001, 2006, 2021 ఇలా ఏ ఎన్నికలు చూసిన అక్కడ ఏకగ్రీవమే.. అయితే, 2016లో టీడీపీ ప్రభుత్వం హయాంలో వైసీపీ అభ్యర్థి లింగమయ్య మొత్తం 8,500 ఓట్ల గాను 2,500…
కడప జిల్లాలో జరుగుతోన్న జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కొలుసు పార్థసారథి.. పులివెందులలో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఆయన అన్నారు.. గత ప్రభుత్వం పాలనలో అవినీతి అక్రమాలు జరిగాయని దీంతో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు..
Minister Anitha: రాఖీ పౌర్ణమి సందర్భంగా విశాఖ కేంద్ర కారాగారానికి ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెళ్లారు. ఈ సందర్భంగా యువ ఖైదీలైన 30 మందితో పాటు జైళ్లశాఖ అధికారులకు సైతం రాఖీలు కట్టింది.