CM Chandrababu: మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రతన్ టాటా గొప్ప వ్యక్తి.. ఆయన సిoప్లీ సిటీ ఎంతో గొప్పది.. ఆయనతో నాకు వ్యక్తిగత అనుబంధం ఉంది.. రతన్ టాటా దేశానికి ఎంతో గొప్ప సేవ చేశారు.. రతన్ టాటా ఒక గొప్ప సామ్రాజ్యం ఏర్పాటు చేశారు.. టాటా ట్రస్ట్ ఏర్పాటు చేసి సమాజానికి ఎంతో గొప్ప సేవా కార్యక్రమాలు చేశారు.. రతన్ టాటా మరణం తర్వాత జరిగిన ఏపీ కేబినెట్ లోనే ఇన్నోవేషన్ హబ్ లకు రతన్ టాటా పేరుతో ప్రారంభించాలని నిర్ణయించాం అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Asia Cup 2025: 165 స్ట్రైక్‌రేట్ ఉన్నా భారత జట్టులో లేడు.. ఆడడం తప్ప ఇంకేం చేయగలం?
ఇక, రతన్ టాటా ఆశయాలను సజీవంగా ఉంచాలన్నదే మా ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఐటీ అభివృద్ధికి రతన్ టాటా మాతో సలహాలను పంచుకున్నారు.. అమరావతిలోని హబ్‌లో డీప్ టెక్, ఏఐ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పుకొచ్చారు. అలాగే, ప్రతి ఇంటికో ఎంట్రప్రన్యూర్ ఉండాలని లక్ష్యంగా మా ప్రభుత్వం పని చేస్తుంది.. నేను గతంలో ప్రతి ఇంటిలో ఒక ఐటీ ప్రొఫెషన్ ఉండాలని భావించా.. హై టెక్ సిటీ నిర్మాణం తరువాత హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధి జరిగింది.. కోహినూర్ వజ్రం ఇక్కడ నుండే లండన్ వెళ్ళింది.. భారత్ అభివృద్ధిలో ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ ఎంతో కీలకం అన్నారు. కాగా, హైదరాబాద్ ఐటీ సిటీ, అమరావతి క్వాంటం వ్యాలీ సిటీ అని కొనియాడారు. అమరావతి నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది.. ప్రపంచంలో భారతీయులు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని చంద్రబాబు తెలియజేశారు.