పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయంపై మంత్రులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. జిల్లాలో అందరూ ఈ విజయం పట్ల రియాక్ట్ కావాలని సూచించారు.. పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి.. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి 11 మంది నామినేషన్లు వేశారనే విషయాన్ని గుర్తుచేశారు సీఎం చంద్రబాబు నాయుడు..
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక లలో టీడీపీ విజయంపై స్పందించారు.. పులివెందులలో జరిగిన ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరిగాయి.. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని తెలిపారు బాలయ్య.. ఇక్కడ జరిగిన ఎన్నికలతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా అక్కడి ప్రజలకు స్వాతంత్య్రం వచ్చింది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇక, ఈ ఎన్నికల్లో 11 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నామినేషన్లు కూడా వేశారు.. ప్రజలు ధైర్యంగా వచ్చి ఓట్లు వేశారు.. అంటే.. అక్కడ…
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్పై స్టే విధించాలని కోరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు దాఖలు చేసిన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ పూర్తి అయ్యింది.. పోలింగ్ చట్ట విరుద్ధంగా అప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్లు.. ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన చేసి పోలింగ్ ను అధికార పార్టీ నాయకులు చేయించారని కోర్టుకు తెలిపారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసెంబ్లీకి వస్తారా..? రారా? క్లారిటీ ఇవ్వండి.. మీ మూలంగా ప్రశ్నలు మురిగిపోతున్నాయని మండిపడ్డారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి.. ముందు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని నిలదీశారు.. ప్రజాస్వామ్య దేవాలయంకు ఆయన ఇచ్చే గౌరవం ఇదేనా? ఆ సభ్యులు ఇచ్చే గౌరవం ఇంతేనా? అంటూ ఫైర్ అయ్యారు..
ఒకే ఒక ఉప ఎన్నిక పులివెందుల కోటను బద్ధలు కొట్టింది.. దశాబ్దాలుగా ఉన్న బానిస సంకెళ్లను తెంచేసింది. పులివెందుల గడ్డపై పసుపు జెండా ఎగిరింది అని వ్యాఖ్యానించారు.. సొంత ఇలాకాలో వైసీపీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకో లేకపోయారంటే.. పులివెందుల ప్రజలు జగన్ రెడ్డిపై ఎంత కసిగా ఉన్నారో అర్థమవుతోందన్నారు.. ఇది వైసీపీ ఓటమి కాదు.. జగన్ అహంకారానికి చెంపదెబ్బ.. అవినీతికి, అణచివేతకు, అరాచకానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు అని వ్యాఖ్యానించారు..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పులివెందులలో టీడీపీ ఘన విజయం సాధించింది.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు.. 6,052 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారు.. టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,735 ఓట్లు రాగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 683 ఓట్లు మాత్రమే వచ్చాయి.. దీంతో, టీడీపీ గ్రాండ్ విక్టరీ కొడితే.. వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకుండా పోయింది.. ఇక 30 ఏళ్ల తర్వాత పులివెందుల…
కడప జిల్లాలో ఆసక్తికరంగా మారిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నేడు ఫలితాలు తెలిపోనున్నాయి.. కడప రిమ్స్ సమీపంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.. జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది..
తాత సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంతవరకూ తననెవరూ ఆపలేరని వార్ టూ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ పంచ్ డైలాగ్ పేల్చారు. చంద్రబాబు, లోకేష్ కు ఆయన డైరక్ట్ వార్నింగ్ ఇ్చచారు. ఎప్పటికైనా టీడీపీలోకి వస్తానని తేల్చేసిన జూనియర్ ఎన్టీఆర్.. తనను చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఆపలేరని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పార్టీలో ఓ వర్గం జూనియర్ ఎన్టీఆర్ రావాలని బలంగా కోరుకుంటోంది. వారిని మరింత సంతోషపెట్టే విధంగా జూనియర్ ఎన్టీఆర్ నేరుగా…