Pilli Sattibabu Resigns: కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పదవికి పిల్లి సత్తిబాబు రాజీనామా చేశారు.. మండలాధ్యక్షుడు నియామకం విషయంలో ఉదయం ఘర్షణ పడ్డారు టిడిపి కోఆర్డినేటర్, కోఆర్డినేటర్ వర్గాలు.. ఈ వ్యవహారంలో ఆయన టీడీపీ పదవికి గుడ్ బై చెప్పడం చర్చగా మారింది.. అయితే, తన రాజీనామాకు గల కారణాలు వివరిస్తూ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు సత్తిబాబు.. నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే నానాజీ తమను పట్టించుకోవడంలేదని లేఖలో ప్రస్తావించారు.. అభివృద్ధి కార్యక్రమాల కోసం టిడిపి కార్యకర్తలు, జనసేన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తుంటే.. జనసేన మండల ప్రెసిడెంట్ ని తీసుకుని రావాలని ఎమ్మెల్యే చెప్తున్నారని లేఖలో పేర్కొన్నారు సత్తిబాబు.. కో ఆర్డినేటర్, నియోజకవర్గ పార్టీ పరిశీలకుల వల్ల పార్టీకి ఏ విధమైన ఉపయోగం లేదని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు సత్తిబాబు.. ఈ వ్యవహారాలు గతంలో నాలుగు సార్లు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లిన ఉపయోగం లేదని లేఖలో పేర్కొన్నారు.. నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేనప్పుడు, తనకు పదవి అవసరం లేదని పార్టీలో కార్యకర్తగా మాత్రమే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు పిల్లి సత్తిబాబు..
Read Also: NCERT UEducate deal: యూఎడ్యుకేట్‌తో NCERT కీలక ఒప్పందం.. దాదాపు 2.5 కోట్ల విద్యార్థులకు యూజ్..