Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల అయ్యారు. 86 రోజుల పాటు జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనపై ఎనిమిది కేసులు నమోదు చేయగా.. అన్నిట్లో బెయిల్ రావడంతో ఇవాళ రిలీజ్ అయ్యారు. జైలు నుంచి బయటకు రాగానే ఆయనకు కాకాణి పూజిత, ఎమ్మెల్సీలు మురళీ, చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఇతర నేతలు స్వాగతం పలికారు.
Read Also: Trump-Modi: భారత్‌పై సుంకాలు పెంచింది అందుకే.. వైట్‌హౌస్ క్లారిటీ
ఇక, కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్ననే విడుదల కావాల్సి ఉంది.. మరి ఎందుకో వాయిదా పడింది.. నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలే నా ఆస్తి.. కేసుల గురించి ఎక్కడ ప్రస్తావించకూడదు.. అందుకే మాట్లాడడం లేదన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్, మంత్రిగా పని చేసిన నన్ను చాలా రోజుల పాటు జైలుల్లో పెట్టారని పేర్కొన్నారు. నాపై ఏడు పీటీ వారెంట్స్ వేశారు.. ఎన్నికల సమయంలో జరిగిన లిక్కర్ కేసులు తిరిగి ఓపెన్ చేశారు.. వైఎస్ జగన్ జిల్లాకి రావడానికి కూడా నిబంధనలు పెట్టారు.. అయినా నా కోసం జగన్ జిల్లాకి వచ్చారని కాకాణి తెలిపారు.
Read Also: Bhadrachalam: భద్రాచలంలో ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. ఒకటవ ప్రమాద హెచ్చరిక జారీ!
అయితే, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి.. ఆయన మీదే రిటర్న్ కేసులు పెట్టారు అని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేసులు, జైళ్లు మమ్మల్ని ఆపలేవు.. టీడీపీ నేతలు చేసే దోపిడీ మీద భవిష్యత్తులో విచారణ ఉంటుంది.. తప్పు చెయ్యలేదు, బెయిల్ ఇవ్వమని కోరాను తప్పా.. ఆరోగ్యం బాగాలేదని ఎప్పుడు బెయిల్ అడగలేదు.. మా పంథా కొనసాగుతూనే ఉంటుంది.. విడుదల వాయిదా పడటంతో మరో కేసు ఉంటుందేమో అని అనుకున్నా.. జైలు మొత్తం వైస్సార్సీపీ నేతలే ఉన్నారు.. ధైర్యంగా పోరాడతాం.. ఎక్కడ ఉన్నా.. నా పోరాటం ఆగదని కాకాణి వెల్లడించారు.