Off The Record: టీడీపీ నేతలే కూన రవి కుమార్ కుర్చీ కింద మంటలు పెడుతున్నారా..?
- కూన రవి దూకుడుతోనే వివాదాల్లో ఇరుక్కుంటున్నారా?..
- గుడ్డ కాల్చి మీదేస్తున్నారని ఎమ్మెల్యే ఫీలింగ్..
- మంత్రి పదవి, నామినేటెడ్ పోస్టుల్లో నిరాశ..
- అచ్చెన్నాయుడు అడ్డుపడుతున్నారని కూన రవి అభిప్రాయం..
- వ్యతిరేకంగా బలమైన లాబీ పని చేస్తోందంటున్న కూన వర్గం..
- సిక్కోలు జిల్లాలో కూన ఒక్కరే అచ్చెన్న మాట వినడం లేదా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: స్వతహాగా కాస్త దూకుడు నైజం ఉన్న నాయకుడు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్. ఇప్పుడాయన వివాదాల్లో చిక్కుకోవడానికి అదే కారణమా అన్న చర్చ జరుగుతోంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో. నిన్నటిదాకా ఇసుక అక్రమార్కులకు అండగా ఉన్నారన్న ఆరోపణలు. నేడు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య సంచలన ఆరోపణలు, ఆత్మహత్యాయత్నం లాంటివి ఆయన్ని రాజకీయంగా ఇరకాటంలో పెడుతున్నాయంటున్నారు. అందులో తప్పొప్పుల సంగతి ఎలాఉన్నా…గుడ్డ కాల్చి తనమీద పడేశారని ఫీలవుతున్నారట ఎమ్మెల్యే. తన బ్యాక్ ఎండ్‌లో ఏదో నడుస్తోందని, రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేని వారు కుట్రలకు తెరతీస్తున్నారని, వాటిని రాజకీయంగానే ఎదుర్కొంటానని సన్నిహితులతో అంటున్నారట కూన. మెదట మంత్రి పదవి ఆశించి భంగపడ్డ రవికుమార్‌కు నిరాశే మిగిలింది. తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో అయినా కేబినెట్ ర్యాంక్ ఉన్న పదవి దక్కుతుందని ఆశించగా… అదీ దక్కలేదు. వీటన్నిటి వెనక జిల్లాకు చెందిన మంత్రి, టీడీపీ సీనియర్ లీడర్ అచ్చెన్నాయుడు ఉన్నారన్నది కూన వర్గం ప్రధాన ఆరోపణ. జిల్లాలో మరో పవర్ సెంటర్ ఉండకూడదన్న ఉద్దేశ్యంతో అచ్చెన్నాయుడు టీడీపీ పెద్దల దగ్గర తన గురించి చెడుగా చెబుతున్నట్టు అనుమానిస్తున్నారు ఆమదాలవలస ఎమ్మెల్యే. అంగబలం, అర్ధబలం ఉన్నా..అపోజిషన్‌ను గట్టిగా ఢీ కొట్టే వాగ్ధాటి ఉన్నా… పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినా… దక్కాల్సిన గౌరవం దక్కక పోగా, ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికి బలమైన లాబీ పనిచేస్తోందన్నది కూన అభిప్రాయం అట.
Read Also: Deeksha Panth : ఇంకేదో అడిగేవాళ్లు.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
Also Read
శ్రీకాకుళం జిల్లాలోని ఎనిమిది నియెజకవర్గాల ఎమ్మెల్యేలు అచ్చన్న ఎస్ అంటే ఎస్ , నో అంటే నో అన్నట్టుగా ఉంటారు. ఒక్క కూన రవికుమార్ వైఖరే మంత్రికి మింగుడు పడటం లేదని చెప్పుకుంటున్నారు. గతంలో సిక్కోలు టిడిపిలో కింజరాపు వర్సెస్ కిమిడి కళావెంట్రావ్ గ్రూప్ అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు మాత్రం జిల్లాలో బాబాయ్ అబ్బాయ్‌లకు ఎదురు నిలుస్తున్నది కూన రవికుమార్ అన్న మాట టీడీపీ వర్గాల నుంచే బలంగా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో… రవికుమార్ మీద వస్తున్న ఆరోపణల వెనక టీడీపీ బడా నేతలు ఉన్నారన్నది ఆయనన వర్గం అభిప్రాయం. పైగా… ఇది మెల్లిగా కులం రంగు కూడా పులుముకుంటోంది. తమ సామాజికవర్గం నేతను ఇబ్బంది పెడుతున్నారంటూ స్వరం పెంచుతున్నారు కాళింగ నాయకులు. కూన ఇమేజ్ డామేజ్ చేయటంలో వైసీపీకంటే సొంత పార్టీనేతలే ముందున్నారని, వాళ్ళు గోతులు తీయడమే ప్రమాదకరంగా మారిందన్నది ఎమ్మెల్యే మనుషుల మాట. ఇప్పుడు కేజీబీవీ ప్రిన్సిపల్ వ్యవహారంలో కూడా రాజకీయ కుట్రలున్నాయని ఆరోపిస్తున్నారు కూన అనుచరులు. అదే సమయంలో ఆయన దుందుడుకు వ్యవహారశైలి కూడా ఓ సమస్య అన్నది జిల్లాలో జరుగుతున్న చర్చ. ఇసుక అక్రమ తవ్వకాల ముఠా చేసిన దాడుల్లో తన ప్రమేయం లేదని గతంలో స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఆయన. ఇప్పుడు ప్రిన్సిపల్ చేసిన ఆరోపణలు కూడా తన క్యారెక్టర్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఆ విషయంలో న్యాయ పోరాటం చేస్తానంటున్నారాయన. మొత్తం మీద రాజకీయ ప్రత్యర్థులకన్నా… సొంత పార్టీ టీడీపీలోని వారే తనను గట్టిగా డ్యామేజ్ చేస్తున్నారని నిర్ధారణకు వచ్చిన ఆమదాలవలస ఎమ్మెల్యే నెక్స్ట్ ఏం చేయబోతున్నారని ఆసక్తిగా గమనిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.
తాజావార్తలు
-
Redmi Book 14 2027: Redmi కొత్త ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్.. Intel Core 7 ప్రాసెసర్, 72Wh బ్యాటరీ, 120Hz డిస్ప్లే
-
Sai Pallavi: “రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు”.. లాస్ ఎంజెల్స్ వేదికగా సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు..
-
West Asia Crisis: పశ్చిమాసియాలో భారతీయుల భద్రతపై ఆందోళన.. 22 మంది మృతి చెందినట్లు విదేశాంగ శాఖ వెల్లడి
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
ట్రెండింగ్
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?