ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు.
మార్కాపురం మారుమోగిపోయిందని.. మార్కాపురంలో వచ్చిన స్పందన తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. జనం నాడి తెలిసిపోయిందని.. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందన్నారు.
చంద్రబాబు, బీజేపీ, పవన్ కల్యాణ్‌లు రాజకీయాల కోసం పేద ప్రజల మీద కక్ష తీసుకునే రాజకీయాలు చూస్తున్నామని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. పెన్షన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ బీనామి సంస్థ సిటిజన్ ఫర్ డెమోక్రసి అని ఆయన ఆరోపించారు.
వాలంటీర్ల సేవల గురించి రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన మీడియా సమావేశంలో నిమ్మగడ్డ రమేష్, పవన్, చంద్రబాబులపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ తుదిశ్వాస విడిచారు. కొద్దిసేపటి క్రితం అనారోగ్యంతో కింజారపు కళావతమ్మ మృతి చెందారు.
జగన్ ఇంటికి వెళ్లే రోజు దగ్గరకు వచ్చిందని, ప్రజలు కసితో ఎదురుచూస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సామాజిక న్యాయం చేసేది టీడీపీనేనని ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు.
బాబు పాలన అంతా విధ్వంసమేనని, ప్రజలను ఇబ్బంది పెడతారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో మళ్ళీ ఆయన తీరు బయటపడిందన్నారు. వాలంటరీల వ్యవస్థ పై ముందు నుంచే చంద్రబాబు కక్ష పెంచుకున్నారని అన్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి మండిపడ్డారు. గరం మసాలా లాగ చంద్రబాబు మాటలు ఉన్నాయని విమర్శించారు. బాబు సభకు 4 వేల మంది కూడా రాలేదని, తన పుట్టినరోజుకి మాత్రం 70 వేల మంది వచ్చారన్నారు. పేదవాళ్ల కాళ్లు పట్టుకోవడం తమ సాంప్రదాయం అని, పేదవారి కడుపు కొట్టడం మీ సాంప్రదాయం అని ఫైర్ అయ్యారు. తానే మళ్లీ ఎమ్మేల్యేగా గెలుస్తానని, మంత్రి పదవితో వవస్తానని మధుసూధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.…
Ex MLA Prabhakar Chowdary on Chandrababu Naidu: తనకు పార్టీ మారే ఆలోచన లేదని, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నేతృత్వంలో పని చేయాలని ఉందని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలిపారు. అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ విషయంలో చంద్రబాబు పునరాలోచించుకోవాలన్నారు. కార్యకర్తలు ఓకే అంటే మాత్రం తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రభాకర్ చౌదరి చెప్పారు. దగ్గుపాటి ప్రసాద్‌కు సహకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. Also Read: Top Headlines…
Janga Krishna Murthy Likely To Join TDP: శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ముందు వైసీపీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. పల్నాడులో వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఉన్నట్లు తెలుస్తోంది. నేడు బాపట్లలో టీడీపీ అధినేత నారా చంద్రబాబును జంగా కలవనున్నారట. ఏప్రిల్ 4 లేదా 5వ తేదీలలో కార్యకర్తలతో కలిసి పల్నాడులో జరిగే బహిరంగ సభలో టీడీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. Also Read: Kesineni…