Kesineni Nani on Chandrababu Naidu: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబుకి పేదలంటే చులకన అని విజయవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. రాజ్యాంగంలో పేదవాడు ఎమ్మెల్యే, ఎంపీ అవ్వకూడదని ఎక్కడైనా రాసి ఉందా? అని ప్రశ్నించారు. ‘క్యాష్ కొట్టు టికెట్ పట్టు’ అన్నది చంద్రబాబు స్కీమ్ అని ఎద్దేవా చేశారు. తన కోసం, తన కొడుకు కోసం, తన పవర్ కోసం, కేసుల నుండి బయటపడడం కోసం ప్రధాని మోడీ కాళ్లు…
Yarlagadda Venkat Rao Starts Election Campaign in Gannavaram: గన్నవరం నియోజకవర్గ బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం మొదలెట్టారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలోని రామాలయంలో వేదపండితులు పూజలు నిర్వహించిన అనంతరం శనివారం సాయంత్రం యార్లగడ్డ తన ప్రచారం ఆరంభించారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు తెలియచేస్తూ.. రాష్ట్రంలో టీడీపీ పాలన ఆవశ్యకతను వివరించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గన్నవరం నియోజకవర్గంలోని అర్హులైన 15వేల…
గుంటూరు తూర్పు నియోజకవర్గం ఉమ్మడి కూటమిలో అసంతృప్తి వెల్లువెత్తింది. తమకు న్యాయం జరగలేదని టీడీపీపై జనసేన నాయకులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. గడచిన రెండేళ్లుగా తమకే సీటు అని ప్రచారం చేసి.. చివరి నిమిషంలో టీడీపీ సీటు దక్కించుకుందని జనసేన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను చెప్పేంతవరకు, జనసేనకు న్యాయం జరిగేంత వరకు.. టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని గుంటూరు జనసేన నగర అధ్యక్షుడు నేరెళ్ళ సురేష్ అల్టిమేటం జారీ చేశారు. టీడీపీ కార్యక్రమాలకు కార్యకర్తలు దూరంగా ఉండాలనే…
పరిశ్రమలు రావాలంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. కలిగిరి మండల కేంద్రంలో కాకర్ల సురేష్, మండల కన్వీనర్ బిజ్జం వెంకట కృష్ణారెడ్డి, వరికుంటపాడు మండలానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకులు, ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన సుంకర అంజనాద్రి, వెంకటాద్రిల ఆధ్వర్యంలో కలిగిరి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు.. సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరించారు.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలో తమ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు అభ్యర్థులు. ఈ క్రమంలో.. టీడీపీ గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రచారం నిర్వహించారు. విజయవాడ రూరల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు.
తప్పు చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడిని చిత్తూరు ఎమ్మెల్యేగా పెట్టారని.. రాష్ట్రాన్ని స్మగ్లింగ్కు అడ్డాగా మార్చారని విమర్శలు గుప్పించారు.
వింజమూరు మండల కేంద్రంలో శుక్రవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్యం కోసం తలపెట్టిన ప్రజాగళం దద్దరిల్లింది. ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో.. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుండి తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, బీజేపీ నాయకులు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రజాగళం సభకు తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలని జనం చంద్రబాబు ప్రసంగానికి జేజేలు పలికారు. చంద్రబాబు నాయుడు మాటలు ఆసక్తిగా విన్నారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు.…
నెల్లూరు జిల్లా కందుకూరులో ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ2 అయితే చంద్రబాబు పలు కేసుల్లో ఏ1 అని..తాను 22 కేసుల్లో ఏ2 కావచ్చు.. కానీ ఎక్కడా కూడా ఆర్థిక నేరాలకు పాల్పడలేదన్నారు.
ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీల నేతలు తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు.సూళ్లూరుపేటలో టీడీపీ గాలి వీస్తోందన్న ఆయన.. జగన్కు ఓటు వేసినందుకు ఆయన ప్రజలను మోసగించారని విమర్శించారు.
ఓ వైపు జోరుగా ఎన్నికల ప్రచారం.. మరో వైపు చేరికలతో ఉత్సాహంగా సాగుతోంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. నాలుగో రోజు కర్నూలు జిల్లాలో బస్సు ఉత్సాహం కొనసాగింది. బస్సు యాత్ర సందర్భంగా పలువురు కళ్యాణదుర్గం టీడీపీ నేతలు, కార్యకర్తలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.