Nellore Politics: సార్వత్రిక ఎన్నికలు ఏపీలో హీట్ పెంచుతున్నాయి.. ఇదే సమయంలో.. నెల్లూరులో బస్తీమే సవాల్ అంటున్నారు అధికార, ప్రతిపక్షాలకు చెందిన నేతలు.. ముఖ్యంగా నెల్లూరు సిటీలో.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.. నెల్లూరు సిటీలో అభివృద్ధి విషయంలో మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి నారాయణ అవాస్తవాలు చెబుతున్నారంటూ వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపణలు చేశారు.. కాదంటే చర్చకు రావాలని నారాయణకు బహిరంగ సవాల్ విసిరారు.. ఇక, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి సవాల్ పై టీడీపీ నేత , డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. రాజకీయాల్లో ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డికి ఏడాది అనుభవం మాత్రమే ఉందన్న ఆయన.. నెల్లూరు సిటీలో అణువణువూ నాకు తెలుసు. నీ స్థాయికి నారాయణతో అవసరం లేదు.. నాతో చర్చకు రా..! అంటూ ఛాలెంజ్ చేశారు.
Read Also: Bandi Sanjay: ప్రారంభమైన బండి సంజయ్ రైతు దీక్ష.. మద్దతు తెలపాలని పిలుపు..!
ఇక, దొంగ ఓట్లతో ఎమ్మెల్సీ అయిన చంద్రశేఖర్‌రెడ్డికి మేం సమాధానం చెప్పాలా..? అని ప్రశ్నించారు రూప్‌కుమార్ యాదవ్.. వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి తాను పేదవాడినని ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు.. కానీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్.. విజయవాడకు రాకపోకలు సాగించేందుకు స్పెషల్ ఫ్లైట్ లు ఉపయోగించారు.. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇస్తాను.. ఈ పేదోడికి శంషాబాద్ వద్ద 10 ఎకరాల పొలం ఉంది అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో బూటకపు హామీలు ఇస్తున్నారు.. దగదర్తి వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం తీసుకువస్తానని చెప్పారు.. ఆరు నెలల్లో అండర్ పాస్ లు నిర్మిస్తానని హామీ ఇస్తున్నారు.. ఐదేళ్లు మన ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా..? మరి ఎందుకు చేయలేదు సాయిరెడ్డి అంటూ నిలదీశారు. ప్రభుత్వంలో నెం.2 గా ఉన్నావు.. ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలంటే సంస్కారం అడ్డం వస్తోందని వ్యాఖ్యానించారు టీడీపీ నేత , డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.