వైజాగ్ ఎంపీ సీటుపై కూటమిలో కుంపటి అంటుకుంది. ఆ సీటు.. బీజేపీకి కేటాయించాలని కమలం పార్టీలో డిమాండ్ ఊపందుకుంది. ఈ క్రమంలో.. వివిధ మోర్చాల ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. ఓట్ బ్యాంక్, గతంలో గెలిచిన సీటును పొత్తుల పేరుతో వదలడం బీజేపీకి నష్టం చేయడమేనని అసమ్మతి వర్గం అంటోంది. కాగా.. వైజాగ్ నుంచి పోటీ చేసేందుకు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ ఆశ పెట్టుకున్నారు. ఇతర పార్టీల కుటుంబ అవసరాల కోసం సీటును బీజేపీ వదులుకోవాల్సి వచ్చిందని జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Heatwave Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాలకు ఐఎండీ తాజా హెచ్చరికలు ఇవే!
పొత్తులో భాగంగా టీడీపీ కోటాలోకి వైజాగ్ ఎంపీ టిక్కెట్ వెళ్ళింది. అందులో భాగంగా.. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బాలయ్య చిన్నల్లుడు భరత్ ప్రచారం ప్రారంభించారు. మరోవైపు.. టీడీపీకి విశాఖ ఎంపీ సీటు కేటాయిస్తే ఓటింగ్ కు దూరం అవుతామని నార్త్ ఇండియన్ సంఘాలు ఇప్పటికే తేల్చేశాయి. అనపర్తి, నర్సాపురం వంటి చోట మార్పులు జరిగినప్పుడు వైజాగ్ ఎందుకు మార్చరని వారు డిమాండ్ చేస్తున్నారు. బలమైన ఓటు బ్యాంకు ఉండి గతంలో గెలిచిన సీటును పొత్తుల పేరుతో వదలడం నష్టం చేకూరుస్తుందని అసమ్మతి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Tata-BMW: బీఎండబ్ల్యూతో టాటా టెక్నాలజీస్ జాయింట్ వెంచర్..
కాగా.. బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా.. ఆరు చోట్ల ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. 10 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేయనుంది. టీడీపీ 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక.. జనసేన రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది.