పిఠాపురంలో పవన్ సమక్షంలో టీడీపీ సీనియర్ నేతలు మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణలు జనసేన పార్టీలో చేరారు. అవనిగడ్డ నుంచి కూటమి అభ్యర్థిగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పని చేశాను.. కానీ, నా విధేయతను పార్టీ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో కాసు మహేష్ రెడ్డి కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేశాను.. కానీ, ఈరోజు గురజాలలో మళ్లీ మహేష్‌రెడ్డికి సీట్ ఇచ్చారని మండిపడ్డారు.
ధర్మవరం సీటు రాకపోయినా…టీడీపీ ఇన్ చార్జ్ పరిటాల శ్రీరామ్ సంతోషంగా ఉన్నారా ? పొత్తుల్లో భాగంగా ధర్మవరం బీజేపీకి వెళ్లిపోయినా సత్యకుమార్ కు అండగా ఉంటానని చెప్పడం వెనక మతలబు ఏమైనా వుందా? తనకు రాకపోయినా పర్వాలేదు…తన శత్రువుకు మాత్రం రాకూడదన్నదే శ్రీరామ్ లక్ష్యమా ? లేదంటే అంతకు మించిన స్ట్రాటజీ వుందా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంపై హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఈ నియోజకవర్గంతో సుదీర్ఘ అనుబంధమున్న పరిటాల కుటుంబానికి ఈసారి టికెట్…