CM Chandrababu: 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగింది.. బ్రిటీష్ పాలనలో కూడా వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదు!
- 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగింది
- ఎన్‌డీడీబీ రిపోర్టు రాగానే నేను ప్రకటన చేశాను
- సిట్ వేసేందుకు సిద్ధపడగా సుప్రీంకోర్టుకు వెళ్లారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu About Tirumala Laddu Adulteration In AP Assembly: బ్రిటీష్ పాలనలో కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరూ రాలేదని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. ఇందులో కుట్ర కోణం ఉందని, సిండికేట్గా తయారయ్యారన్నారు. 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగిందని, ఎన్‌డీడీబీ రిపోర్టు రాగానే తాను ప్రకటన చేశానన్నారు. సిట్ వేసేందుకు సిద్ధపడగా సుప్రీంకోర్టుకు వెళ్లారని, సుప్రీంకోర్టు సిట్ వేసిందని గుర్తు చేశారు. సిట్ ఛార్జిషీట్ వేసి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేసిందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
‘2019-24 మధ్య దేవాలయాల్లో అరాచకాలు జరిగాయి. నేను సీఎం కాగానే రెండో సంతకం టీటీడీ ఈవోను నామినేట్ చేశాను. మా కులదైవం వెంకటేశ్వర స్వామి, నన్ను కాపాడింది ఆ దేవదేవుడే. నేను సిద్ధాంతపరంగా పోరాడాను. మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి రమ్మంటే నాపై దాడి చేశారు. ఇప్పుడు మావోయిస్టు టాప్ లీడర్లు లొంగిపోతున్నారు. బ్రిటీష్ పాలనలో కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదు. ఇందులో కుట్ర కోణం ఉంది, సిండికేట్గా తయారయ్యారు. 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగింది. ఎన్‌డీడీబీ రిపోర్టు రాగానే నేను ప్రకటన చేశాను. సిట్ వేసేందుకు సిద్ధపడగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు సిట్ వేసింది. సిట్ ఛార్జిషీట్ వేసి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేసింది’ అని సీఎం అన్నారు.
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
‘2020 ఫిబ్రవరిలో టెండర్ నిబంధనలు మార్చారు. 2022 మేలో భోలేబాబా సంస్థపై ఫిర్యాదు, విచారణకు ఆదేశించారు. 2022 ఆగస్టులో నివేదిక వచ్చింది. 2024 జులైలో ఎన్‌డీడీబీ నివేదిక వచ్చింది. పాలు ఏమాత్రం తయారు చేయలేని కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చారు. 10 లక్షల కేజీల ఆవు నెయ్యి కోసం టెండర్లు ఇచ్చారు. కల్తీ నెయ్యి కోసం వచ్చిన రిపోర్టును తొక్కి పెట్టారు. ఎన్‌డీడీబీ రిపోర్ట్ 2024 జులై 23న వచ్చింది. S వాల్యూ-5 ప్రకారం జంతు కొవ్వు ఉందన్న రిపోర్టు ఆధారంగానే నేను మాట్లాడాను. రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలన్న నిబంధన తొలగించారు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read: Pawan Kalyan: వైఎస్ జగన్ తప్పు చేశారని నేను ఎక్కడా చెప్పలేదు.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
‘ప్రమాదకర రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేశారు. దేవుడి కోసం తక్కువ ధరకే ఇస్తున్నారంటే ఆలోచించుకోవాలి. అవినీతి గానీ, కుట్ర పూరిత ఆలోచన దీనివెనుక ఉంటుంది. కెమికల్స్తో నెయ్యి తయారీ చేసి ఇంకా బుకాయిస్తున్నారు. ఇద్దరు టీటీడీ చైర్మన్లు కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి ఏం జరగలేదని అన్నారు. తిరిగి మనల్నే క్షమాపణ చెప్పమంటున్నారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బ తీసేందుకు మొదటి నుంచి ప్రయత్నం చేశారు. తిరుమల తిరుపతి వెళ్లే ఆర్టీసీ బస్సుల టికెట్లో అన్యమత ప్రచారం చేశారు’ అని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!