వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఉదయగిరిని సిరుల గిరిగా చేసుకుందామని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు మహిళా శక్తి మహిళా నేతలతో కలిసి కాకర్ల సురేష్ సోమవారం సమావేశం నిర్వహించారు.
ఎస్సీ వర్గీకరణకు అండగా నిలిచిన ఎన్డీఏ కూటమి గెలుపే ఎమ్మార్పీఎస్ లక్ష్యం అని ఎమ్మార్పీఎస్ నేతలు తెలిపారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఎంఎస్పి సీనియర్ నాయకులు ఉదయగిరి బిట్ టూ ఇంఛార్జి గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మార్పీఎస్ జిల్లా స్థాయి, నియోజకవర్గంలోని మండల నాయకులతో కలిసి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ ను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
తెలుగుదేశం పార్టీని ఇప్పుడు పెన్షన్ టెన్షన్ వెంటాడుతోందా? వైసీపీ మైండ్గేమ్తో టీడీపీ నాయకులు కంగారు పడుతున్నారా? దానివల్ల సైకిల్ పార్టీకి ఎంత నష్టమో… వైసీపీకి కూడా అంతే ఎఫెక్ట్ అన్న వాదనలో నిజమెంత? అలా వాదిస్తున్నవారు చెప్పే రీజన్స్ ఏంటి? ఏతావాతా ఇప్పుడు పెన్షన్స్ చుట్టూ మొదలైన కొత్త రాజకీయం ఏ టర్న్ తీసుకునే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సామాజిక భద్రత పెన్షన్ల అంశమే హాట్ టాపిక్ అయింది. పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా…
ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పి వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా కదిరి వచ్చిన సీఎం జగన్.. పార్టీ కండువా కప్పి చాంద్ బాషాను పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మాట మార్చి మాట్లాడే నేర్పరి అని, దిగజారి మాట్లాడతారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. జగన్ తన రాజకీయ స్వార్థం కోసం పెన్షర్ల పొట్ట కొట్టారని చంద్రబాబు సిగ్గులేకుండా అంటున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. వాలంటరీలు వద్దు అని ఈసీ దగ్గర పైరవీ చేసింది ఎవరంటూ ఆయన ప్రశ్నించారు.
కడియం శ్రీహరి, కావ్య ఏక్కడ పోటీ చేసిన డిపాజిట్ రాకుండా చేస్తాం..! కడియం శ్రీహరి, కావ్య ఏక్కడ పోటీ చేసిన డిపాజిట్ రాకుండా చేస్తామని ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వెళ్ళే ఈ కుట్ర ఇవ్వాల్టిది కాదని, అసెంబ్లీ సమావేశంలోనే ఈ కుట్రకు బీజం పడిందన్నారు. మూడు నెలల క్రితమే ఈ కుట్రకు తెర లేసిందన్నారు. రేవంత్ రెడ్డి, కడియం శ్రీహరి భుజం పైనా…
పెన్షన్ల అంశంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ ఇంటింటి ప్రచారానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు పార్టీ కేడరుకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ డబ్బులను కాంట్రాక్టర్లకు ఇచ్చేశారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.