ఏపీలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో కడప జిల్లా కమలాపురంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీలోకి జోరుగా సాగుతున్న వలసలు అధికార వైసీపీలో ప్రకంపనలు రేపుతుంది. గత కొద్ది నెలలుగా బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా కమలాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్న టీడీపీ ఇంచార్జి పుత్తా నరసింహారెడ్డి గ్రామ గ్రామానా ఇంటింటికి తిరుగుతూ.. టీడీపీ సూపర్ సిక్స్ పథకాల వల్ల కలిగే లబ్ది గురించి వివరిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. కమలాపురం నగర పంచాయతీ, కమలాపురం మండలం, VN పల్లి మండలం, చింతకొమ్మ దిన్నె మండలం, ఇలా నియోజక వర్గవ్యాప్తంగా మండలాల వారీగా, గ్రామగ్రామానా కీలక వైసీపీ నేతలు వందలాదిగా కుటుంబాలతో సహా వైసీపీని వీడి పుత్తా సమక్షంలో సైకిలెక్కడం కమలాపురంలో చర్చనీయాంశంగా మారింది.
Read Also: Delhi Capitals: రాజాంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ సందడి.. విద్యార్థులతో దాదా ముచ్చట్లు!
2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కమలాపురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. టీడీపీ ఇంచార్జి పుత్తా నరసింహా రెడ్డికి బదులుగా ఆయన కుమారుడు పుత్తా చైతన్యరెడ్డికి టీడీపీ టికెట్ ప్రకటించింది. అయితే, చైతన్య రెడ్డి మాత్రం తన తండ్రికే టికెట్ ఇవ్వాలని హైకమాండ్‌ను రిక్వెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, లోకేష్ మాత్రం పుత్తా చైతన్య రెడ్డికే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు తోడుగా టీడీపీ- జనసేన పొత్తు కూడా పుత్తా చైతన్య రెడ్డికి రాజకీయంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా కమలాపురం టీడీపీ అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి చేతిలో జగన్ మేనమామ రవీంద్రనాథ రెడ్డి ఓటమిని ఎవరూ తప్పించలేరని.. ఈసారి కమలాపురం గడ్డపై టీడీపీ జెండా ఎగరడం ఖాయమని తెలుగుతమ్ముళ్లు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.