వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఉదయగిరిని సిరుల గిరిగా చేసుకుందామని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు మహిళా శక్తి మహిళా నేతలతో కలిసి కాకర్ల సురేష్ సోమవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం తీసుకొస్తానని తెలుగుదేశం పార్టీ హయాంలోని మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి పెద్దపీట వేసిందన్నారు. మహిళలకు ఏ పార్టీలో లేని స్వేచ్ఛ గౌరవం తెలుగుదేశం పార్టీలో ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాగానే ఎనిమిది మండలాల్లో పరిశ్రమల స్థాపించి మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే ఆ కుటుంబాలు బాగుపడతాయన్నారు. ఎన్నో కుటుంబాలు సరైన ఉపాధి లేక విచ్ఛిన్నం అవుతున్నాయన్నారు. గత రెండు సంవత్సరాలు కాలంగా మహిళల కోసం టైలరింగ్ బ్యూటిషన్ కోర్సులు నిర్వహించి వారి ఆర్థిక ఎదుగుదలకు కృషి చేశానని కాకర్ల సురేష్ పేర్కొన్నారు.
Udayagiri: ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపే మా లక్ష్యం..
గడిచిన కాలంలో ఎవరు ఏం చేశారు.. ఎవరు వస్తే ఈ ప్రాంత అభివృద్ధి చెందుతుంది.. ఉపాధి దొరుకుతుందో ఆలోచించుకోవాలని కాకర్ల సురేష్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, నాయకత్వం గురించి తెలుసుకుని మిగతా వారికి తెలియపరిచి తెలుగు దేశాన్ని ఆదరించేలాగా ప్రోత్సహించాలన్నారు. అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు గురించి వివరించాలన్నారు. ముఖ్యంగా యువతి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డిజైన్ చేసిన కలలకు రెక్కలు డాట్ కం గురించి తెలియజేయాలని కాకర్ల సురేష్ అన్నారు.
నగదు ఇవ్వడం ద్వారా ప్రజలు ఆర్థికంగా ఎదగలేరని డబ్బులు ఎలా సంపాదించాలో నేర్పించాలన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ముస్లిం మైనార్టీ మహిళలు కూడా ఆలోచించాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే ముస్లింలకుఅన్ని రకాల సౌకర్యాలు అందాయి అన్నారు. రాజకీయాలు చేసేందుకు తాను రాలేదని.. సర్వీస్ చేసేందుకు వచ్చానని ఆదరించి ఆశీర్వదించాలని కాకర్ల సురేష్ కోరారు. ఈ కార్యక్రమంలో సీతారాంపురం మాజీ జడ్పిటిసి సభ్యులు కలివేల జ్యోతి, ఎస్టీ సెల్ అధ్యక్షురాలు జయలక్ష్మి, మహిళా అధ్యక్షురాలు ప్రధాన కార్యదర్శి శాంతమ్మ, అరుణ, మనీషా, నాదెండ్ల రమాదేవి, అంకమ్మ, రాజేశ్వరి, శాంతి, ప్రసన్న, మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు.