Bode Prasad: పెన్షన్ల పంపిణీపై నీచరాజకీయాలు.. జోగి రమేష్ రాజకీయ సమాధికి పెనమలూరే వేదిక..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bode Prasad: కృష్ణాజిల్లాలో పెన్షన్ల పంపిణీపై వివాదం కొనసాగుతూనే ఉంది.. పెన్షన్ తీసుకోవడానికి వెళ్లి వడదెబ్బతో మృతిచెందారంటూ.. వారి కుటుంబ సభ్యులు చెబుతుండగా.. వాటిపై కూడా రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు.. ఈ వ్యవహారంలో మంత్రి జోగి రమేష్ తీరును తప్పుబట్టారు పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్.. పెన్షన్ పంపిణీపై వైసీపీ నీచరాజకీయాలు చేస్తోందని మండిపడ్డా యాన.. జోగి రమేష్ రాజకీయ సమాధికి పెనమలూరు వేదిక కాబోతోందని జోస్యం చెప్పారు. జోగి రమేష్ అధికార దాహం అనే మానసిక రోగం ఉంది.. వైసీపీ అధిష్టానం జోగి రమేష్ ను మూడు నియోజకవర్గాలు మార్చేసరికి అతని మానసిక పరిస్థితి దెబ్బతిందన్నారు. ఎక్కడ ఎప్పుడు శవం దొరుకుతుందా? రాజకీయం చేద్దామనే ఆలోచనతో జోగి రమేష్ ఉన్నాడు అంటూ ఫైర్ అయ్యారు.
Read Also: Fake Currency: బాలాపూర్లో 25 లక్షల నకిలీ కరెన్సీ పట్టివేత .. నలుగురు అరెస్ట్
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
అసలు వజ్రమ్మ మృతికి కారణం ఎవరో వారి కుటుంబ సభ్యులే చెబుతున్నారన్న ఆయన.. పెన్షన్ పంపిణీ చేయాల్సిన అధికారులు మూడుసార్లు సచివాలయానికి ఇంటికి వజ్రమ్మను తిప్పటంతో ఆమె చనిపోయిందన్నారు. అనోరోగ్యంతో ఉన్న వారికి ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలనే నిబంధనలను అధికారులు ఉల్లంఘించారని ఆరోపించారు. వజ్రమ్మ చనిపోయిన విషయం తెలుసుకుని వేరే సచివాలయం నుంచి తీసుకొచ్చిన డబ్బులు పంపిణీ చేశారని మండిపడ్డారు బోడె ప్రసాద్. కాగా, పెన్షన్ల పంపిణీ చేపట్టిన తొలిరోజే.. పెన్షన్లను తీసుకోవడానికి వెళ్లి.. వడదెబ్బతో ఒకేరోజు నలుగురు మృతిచెందారు.. పెన్షన్ల పంపిణీలో జాప్యం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని మృతుల కుటుంబ సభ్యులు చెబుతున్నవిషయం విదితమే.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!