50 సంవత్సరాలకు బీసీలకు పింఛన్, లక్ష రూపాయలు పెళ్ళికానుక, పది లక్షల చంద్రన్న బీమా అందిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ విడుదల చేయడం శుభ పరిణామమని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు.
ఇది చంద్రబాబుకు.. రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతోన్న యుద్ధం.. వైసీపీకి ఓటువేసి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుండగా.. అందులో భాగంగా పూతలపట్టులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. నిజం ఒకవైపు అబద్ధం ఒకవైపు ఉంది.. మంచి ఓవైపునా చెడు మరోవైపునా ఉంది.. ధర్మం ఒకవైపు.. అధర్మం మరోవైపు ఉన్నాయి..…
సమిష్టిగా కృషిచేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఉదయగిరి మండల కేంద్రంలోని కళ్యాణ మండపం నందు సీతారాంపురం ఉదయగిరి మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసైనికులు, బీజేపీ నాయకులతో సమీక్ష సమావేశంతో పాటు పరిచయ కార్యక్రమాన్ని ఉదయగిరి మండల కన్వీనర్ బయన్న, సీతారాంపురం మండల కన్వీనర్ ప్రభాకర్ రాజులు నిర్వహించారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోనే జలదంకి మండలం బ్రాహ్మణ కాక గ్రామ ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పట్టారు. ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు నాయకులు పోటెత్తారు.
Maganti Babu Press Note: ముఖ పరిచయం, రాజకీయ అనుభవం లేని వ్యక్తిని.. చరిత్ర కలిగిన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలా నిలబెడతారు? అని ఏలూరు మాజీ ఎంపీ, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు ప్రశ్నించారు. అసలు బీసీ అనే మాటను ఎందుకు ప్రచారంలోకి తీసుకొచ్చారని, ఎవరైనా బీసీలు తమకు ఏలూరు పార్లమెంట్ సీట్ కావాలని అడిగారా? అని మండిపడ్డారు. 4 సీట్లు ఒకే కుటుంబంలో ఇస్తే మిగతా బీసీ కులాలు అంగీకరిస్తారా?…