పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామానికి చెందిన టీడీపీ ముఖ్య నాయకులతో పాటు సుమారు 20 కుటుంబాలు వైసీపీలో చేరాయి.
సూపర్ 6.. సూపర్ 7.. బెంజ్ కార్ హామీలు నమ్మితే.. కొండచిలువ నోట్లో తలపెట్టినట్టే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. బాబా అధికారంలోకి వస్తే వర్షాలు రావు.. రిజర్వాయర్లు ఖాళీ అవుతాయని వ్యాఖ్యానించారు.
ఎన్నికల వేళ నేతలు ప్రచార జోరును పెంచారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కౌతాళం ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రాలయంలో మార్పు వస్తోంది.. మంచి రోజులు వస్తున్నాయని ఆయన అన్నారు.
175 శాసనసభ స్థానాలలో పోటీలో 124 మంది సంపన్నులు అని, బీజేపీ అవినీతి కూటమిగా మారిపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ కాదు చీటింగ్ సిక్స్ అని ఆయన వ్యాఖ్యానించారు. పెన్షన్లు, సంక్షేమ పథకాలు ఇస్తే జాతీయ వనరులన్నీ వృధా అయిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. సోమరులు అయిపోతారు అని చెప్పిన పార్టీ టీడీపీ అని, వైసీపీ సంక్షేమాలు పథకాలు కొనసాగిస్తాం.. 2 వేలో 3…
నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లోని ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. మంత్రాలయం, కొడుమూరు సెగ్మెంట్లో ప్రజాగళం నిర్వహిస్తారు. అలాగే కౌతాలం, గూడూరు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు చంద్రబాబు. ఈ రోజు సాయంత్రం 3.50 గంటలకు నెల్లూరు నుంచి కౌతాలంకు వస్తారు. రాత్రి గూడూరులోనే బస చేస్తారు చంద్రబాబు. కాగా చంద్రబాబు నాయుడు సోమవారం నందికొట్కూరులో పర్యటించనున్నారని ఆ పార్టీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు. శనివారం…
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల తనపై ప్రతిపక్ష నాయకురాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన ఆరోపణలపై హోమ్ మినిస్టర్ తానేటి వనిత స్పందించారు.