విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాట్లాడుతూ.. జనసేన పార్టీ లేదు, గుర్తింపు లేదు జగన్ మోహన్ రెడ్డి మీద తొడ కొడతాడంట అని విమర్శించారు. ఈరోజు నీ గ్లాస్ నీ దగ్గర లేదని దుయ్యబట్టారు.
ఈ ఐదేళ్ళ లో బాగుపడిన వర్గాలు ఎవరు లేరని.. ఈ రోజు నేను పెట్టిన మేనిఫెస్టో తో అన్ని వర్గాలు బాగుపడతాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెనాలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ..
ఏలూరు జిల్లా దెందులూరు ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి ఆశయాలు నెరవేర్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి వంగవీటి రాధా అని.. ఆయన సేవలు ఈ రాష్ట్రానికి అవసరమని, తగిన గుర్తింపు ఇస్తామన్నారు. దెందులూరులో చింతమనేని అభిమానులు ఎక్కువ ఈలలు వేస్తారు తక్కువ పని చేస్తారు.. ఇకనుంచి ఎక్కువ పని చేయాలన్నారు.
ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ కొనసాగిస్తామని.. చంద్రబాబుకు ఓటేస్తే నష్టమని.. పథకాలన్నీ ఆపేస్తాడని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు వయసు 75 దాటింది, ఈ జీవితంలో వెన్నుపోట్లు మోసాలతో జీవితం గడిచిపోయిందని.. ఇప్పటికైనా ఆయన జీవితంలో పశ్చాతాపం లేదని జగన్ వ్యాఖ్యానించారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను మూడు పార్టీల నేతలు ఆవిష్కరించారు. ఉమ్మడి మేనిఫెస్టో చంద్రబాబు, పవన్ కల్యాణ్, సిద్జార్థ్ నాథ్ సింగ్లు విడుదల చేశారు.