TDP: నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినా.. పార్టీ ఆదేశాలు పట్టించుకోకుండా ఎన్నికల బరిలోనే ఉన్న రెబల్స్‌కు షాకిచ్చింది తెలుగుదేశం పార్టీ.. రెబెల్ అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఆరుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.. ఇక, టీడీపీ సస్పెన్షన్ వేటు వేసిన నేతల వివరాల్లోకి వెళ్తే.. అరకు రెబెల్ సివేరి అబ్రహం, విజయనగరం రెబెల్ మీసాల గీత, అమలాపురం రెబెల్ పరమట శ్యాం కుమార్, పోలవరం రెబెల్ ముడియం సూర్య చంద్రరావు, ఉండికి చెందిన కలవపూడి శివ, సత్యవేడుకి చెందిన రాజశేఖర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ.. తెలుగుదేశం పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని వేటు వేసినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు అచ్చెన్నాయుడు.
Read Also: Supreme court: కేజ్రీవాల్ అరెస్ట్, కస్టడీ పిటిషన్ విచారణపై ఉత్కంఠ! ఈరోజు ఏం జరగనుంది?
అమలాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీలో ఉన్న తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థి పరమట శ్యామ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు… అమలాపురం అసెంబ్లీ టికెట్ టికెట్ దక్కక పోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు పరమట శ్యామ్.. నామినేషన్ ఉపసంహరించుకోవాలని టీడీపి నేతలు ఒత్తిడి చేసినా తలొగ్గలేదు శ్యామ్. తెలుగుదేశం అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఓట్లను టీడీపీ రెబెల్, స్వతంత్ర అభ్యర్థి పరమట శ్యామ్ చీల్చే అవకాశం ఉందంటున్నారు.