చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కేఆర్జే భరత్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. నామినేషన్ యాత్ర విజయ యాత్రగా కనిపిస్తుందన్నారు.
ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. రాజన్న దళం అధినేత మెట్టుకూరు చిరంజీవి రెడ్డి వైసీపీ పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి మంగళవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపించారు.
తిరుపతిలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పర్యటించారు. సోమవారం నామినేషన్ వేసిన ఆయన.. ఈరోజు తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ వేసి ఆనవాయితీ ప్రకారం శ్రీవారి ఆశీస్సులు కోసం వచ్చానన్నారు. చంద్రగిరి ప్రాంతాన్ని కొందరు చందనగిరిగా మార్చారని తెలిపారు. చంద్రగిరి అభివృద్ధి కోసం ప్రజలు టీడీపీ అభ్యర్థి నానిని గెలిపించాలని పేర్కొన్నారు. చంద్రబాబులానే భారీ మెజారిటీతో నాని చంద్రగిరి ప్రజలు గెలిపించాలని కోరారు.
ష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా అనపర్తి సీటును బీజేపీకి అప్పగించిన విషయం తెలిసిందే. టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆ సీటు తనకే కావాలని పట్టుపట్టడంతో నేతలు దిగివచ్చారు. అతడితో ఎన్నిమంతనాలు జరిపినా ప్రయోజనం లేకపోయింది.
జై భీమ్ స్ఫూర్తి తో రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాన్ తెలిపారు. ఉప్పాడ కొత్తపల్లి సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. తన భార్య వలన క్రిస్ట్మస్ చేసుకుంటానన్నారు.
కూటమి ప్రభుత్వం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు జగన్ అన్యాయం చేశారని ఆరోపించారు.
పిఠాపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పవన్ తన అఫిడవట్లో తన ఆస్తుల వివరాలు పొందుపరిచారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. నామినేషన్లో భాగంగా పవన్ ఇష్ట పూర్వకంగా పోటీ చేస్తున్నట్లు ప్రమాణం చేశారు.