ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుంది.. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. ఈ నెల 27న వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు యనమల కృష్ణుడు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు.
ఎన్నికలకు గత కొంత కాలంగా సైలెంట్‌గా గ్రౌండ్ వర్క్ చేసిన బీసీ జనార్థన్ రెడ్డి సరిగ్గా ఎన్నికల కోడ్ వచ్చాక అదను చూసి వైసీపీని చావుదెబ్బ కొట్టారు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంత గ్రామం అయిన తమ్మడపల్లెలో తొలిసారిగా బీసీ జనార్థన్ రెడ్డి పాగా వేసారు. గత 20 ఏళ్లుగా ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి నమ్మిన బంటుల్లాగా ఉంటున్న 20 మంది ముఖ్య అనుచరులు బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో…
ఏలూరు జిల్లా కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు సమక్షంలో ఆటపాక గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు. దాదాపు 200 మంది కార్యకర్తలకు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనపై మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో జనాలకు మాయమాటలు చెబుతూ, మోసాలు చేస్తున్నారని అన్నారు. తమ వెనుకాల నిలబడకుంటే కుటుంబాలను సైతం బెదిరిస్తున్నారని తెలిపారు. ఆ బెదిరించే…
జగన్ మార్క్.. ప్రతి ఇంట్లో.. ప్రతీ గ్రామంలో కనిపిస్తుంది.. జగన్ కి పేదలపై ఉన్నంత ప్రేమ.. దేశంలో ఏ నాయకుడికి లేదు, ఉండదు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. జగన్ చేయలేని స్కీంలు.. చంద్రబాబు ఆయన బాబు కూడా చేయలేడని పేర్కొన్నారు.
మే 13న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జలదంకి మండలంలోని గట్టుపల్లిలో టీడీపీ నాయకులు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని గడపగడపకు తిరుగుతూ సౌమ్యుడు, స్నేహ శీలి, ప్రజాసేవకులు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని అదే విధంగా ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి కాకర్ల సురేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.