రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీపై ఏపీ సీఎం సంకేతాలు ఇచ్చారు. టీడీపీ హయాంలోని ఇసుక పాలసీకి.. జగన్ ప్రభుత్వ ఇసుక పాలసీకి తేడాను అధికారులు వివరించారు. గత ప్రభుత్వ ఇసుక పాలసీ వల్ల జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబుకు తెలిపారు.
రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజులో 95 శాతం మేర పెన్షన్లు పంపిణీ చేసింది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం.. సాయంత్రం ఏడుగంటల సమయానికి దాదాపు 94.15 శాతం మేర పంపిణీ పూర్తి చేసింది.
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో నెం.256ను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది.
మేము ఓడినా ప్రజలకు కోసం మేము పోరాటం చేస్తామని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. వాలంటరీ వ్యవస్థను కుడా చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.
Margani Bharat Ram: తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్ట్ ఈ దుస్థితికి గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకమే కారణం అని ఆయన మండిపడ్డారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదు అయింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కోర్టుకు హాజరు పరుస్తున్న సమయంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి కొమర శివపై పిన్నెల్లి దాడి చేసిన అంశంపై ఐపీసీ సెక్షన్ 323 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.