Gudivada Amarnath: ఉత్తరాంధ్రపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిది సవతి తల్లి ప్రేమ అని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేస్తారో చెప్పకుండా వైసీపీని నిందించడానికి పరిమితం అయ్యారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ ప్రపంచంలో మరే రాజకీయ నాయకుడికి ఉండవు అంటూ మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు ఉన్న భూ సమస్యలు సహా అన్ని పరిష్కరించి వైసీపీ ప్రభుత్వం హయాంలో…
ఐదేళ్ల వైసీపీ విధ్వంసకర పాలనలో అన్ని రంగాలు వెనక్కి వెళ్లాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం గుర్తించిన గ్రోత్ ఇంజిన్లను గత ప్రభుత్వం విస్మరించింది.. పోలవరం, నదుల అనుసంధానం, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, విద్యుత్, పారిశ్రామిక రంగాలు తదితరాలను వైసీపీ పట్టించుకోలేదని విమర్శించారు.