ఐటీ, మానవ వనరులు, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా నారా లోకేష్ ఇవాళ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లోని 208వ నంబర్ గదిలోకి లోకేష్ ప్రవేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకం చేసిన ఐదు ఫైళ్లను పరిశీలించేందుకు మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ సంతకం చేసి, సోమవారం సమావేశం కానున్న మంత్రివర్గానికి పంపారు. అయితే.. లోకేష్ మంత్రి బాధ్యతలు స్వీకరించడంపై…
మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా నారా లోకేష్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించి, మెగా డీఎస్సీ నిబంధనల తొలి ముసాయిదాపై సంతకం చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లోని 208వ నంబర్ గదిలోకి లోకేష్ ప్రవేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకం చేసిన ఐదు ఫైళ్లను పరిశీలించేందుకు మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ సంతకం చేసి, సోమవారం సమావేశం కానున్న…
శనివారం నాడు నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా పై అట్రాసిటీ కేసును త్రీ టౌన్ పోలీసులు నమోదు చేసారు. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. 29 వ వార్డు సచివాలయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోల విషయంలో టీడీపీ నేతలు, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో భాగంగా తనను కులం పేరిట టీడీపీ పార్టీకి చెందిన నేత తిమ్మయ్యను చైర్ పర్సన్ మాబున్నిసా దూషించారని…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ భేటీ జరుగుతోంది. ఈ భేటీకి తెలుగుదేశం ఎంపీలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. తొలి పార్లమెంటరీ పార్టీ భేటీ కావటంతో సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్ నిర్వహించారు. ప్రజా దర్బార్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రజా దర్బార్ ద్వారా చాలా సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని మంత్రి వెల్లడించారు.