టీడీపీ నేత కూన రవి కుమార్ కి శరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రాష్ట్రాన్ని వదిలివెల్లోద్దని కూనరవికుమార్ కి ఆదేశం ఇచ్చింది. అయితే కూన రవి కుమార్ మాట్లాడుతూ… భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆటంకం కల్పిస్తున్నారు. కనీసం నోటీసు ఇవ్వకుండా… ఇంటి వద్దకు వచ్చారు. నేను ఏటువంటి నిరసనకు పిలుపు ఇవ్వలేదు. నన్ను ఏందుకు అడ్డుకుంటున్నారో కనీసం చెప్పలేదు . ఇప్పటికి మూడు తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పటికి పదిసార్లు పోలీసులు ఇష్టారాజ్యంగా ఇంట్లోకి…
టీడీపీ పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది వైసీపీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంచుతోందని ఎస్ఈసీ కి ఫిర్యాదు చేసారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి. దొంగ ఓటర్లను తరలిస్తున్నారని ఫిర్యాదు చేసారు. స్థానిక ఎన్నికల్లో టిడిపి అక్రమాలకు పాల్పడుతోంది. చంద్రబాబు పాట్లు చూస్తే జాలి కలుగుతోంది. ఉనికి కోసం నానా రకాలుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఓటుకు ఐదు వేలు నుంచి పదివేలు ఇస్తున్నారు. అధికారులను బెదిరిస్తున్నారు. ఏ…
పెట్రోల్, డీజిల్ పై పన్ను భారాన్ని తగ్గించేది లేదంటూ ప్రజా ధనంతో ప్రకటనలు ఇచ్చుకొని దోచుకుంటున్న ఘనుడు దేశ చరిత్రలో జగన్ ఒక్కడే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు 23 రాష్ట్రాలు పన్ను భారాన్ని తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించినా ఏపీ మాత్రం బాదుడు విషయంలో వెనక్కి తగ్గనంటోంది. అసత్య ప్రకటనలతో ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నించి వైసీపీ ప్రభుత్వం అభాసు పాలయ్యింది. చంద్రబాబు హయాంలో ప్రజల పై…
తెలుగుదేశం పార్టీలో విషాదం చోటు చేసుకుంది. ఆపార్టీ సీనియర్ నేత, పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకి అత్యంత సన్నిహితులు బొప్పన రాఘవేంద్రరావు కన్నుమూశారు. విజయవాడలో తెలుగుదేశం జెండా పట్టిన మొట్ట మొదటి కరుడుగట్టిన తెలుగుదేశం వాది బొప్పన. తెలుగుదేశం సైనికుడు గొప్ప నాయకుడు బొప్పన రాఘవేంద్రరావు శనివారం అర్థరాత్రి శివైక్యం పొందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బొప్పన రాఘవేంద్రరావు లాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలుగుదేశం పార్టీకి , ప్రసాదంపాడు గ్రామానికి తీరని…
సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ద్వారా సౌర విద్యుత్ కొనుగోళ్లల్లో భారీ స్కామ్ జరిగిందంటూ టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. సౌర విద్యుత్ కొనుగోళ్లల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందన్న ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వం తొమ్మిది వేల మెగా వాట్ల సౌర విద్యుత్ కొన్నామని విపరీతంగా ప్రచారం చేసుసుంటోందని, 2020 నవంబర్ నెలలో సెకీ పిలిచిన టెండర్లల్లో రూ. 2కే సౌర విద్యుత్ ఇచ్చారని అన్నారు. అలాగే గుజరాత్…
అమరావతి పరిరక్షణ కోసం రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు సంఘీభావం తెలియజేస్తున్నా అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇది పాదయాత్ర కాదు… రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్ర. రాష్ట్ర భవిష్యత్ కోసం కన్నతల్లి లాంటి భూముల్ని త్యాగం చేసిన పుడమి తల్లి వారసులు చేస్తున్న ఉద్యమం. ఈ మహాపాదయాత్ర ద్వారానైనా పాలకులకు కనువిప్పు కలగాలి. అహంకారంతో మూసుకుపోయిన ముఖ్యమంత్రి కళ్లు తెరుచుకోవాలి. పగలు, ప్రతీకారాలు, కూల్చివేతలు, రద్దులపై చూపుతున్న శ్రద్ద రాష్ట్రాభివృద్ది పై…
రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానం అనడంలో వాస్తవం లేదు అని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతు భరోసా మొదలుకొని వైఎస్సార్ జలకళ వరకూ అనేక పథకాలు అమలు చేస్తున్నాం. తొలి క్యాబినెట్ లోనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 7 లక్షల పరిహారం అందించాలని ఆదేశించిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్. గత ప్రభుత్వంలో సాంకేతిక కారణాల వల్ల ఈ పథకం కింద రాని వారికి 450 మందికి అదనంగా ఇచ్చాం. 2020లో…
ఏపీలో టీడీపీ నేతల అరెస్టుల పర్వ కొనసాగుతోంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహదేవ సందీప్ నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా హై డ్రామా చోటుచేసుకుంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో తిడుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసారని పోలీసులు కేసు నమోదు చేశారు. సందీప్ నాయుడు పై చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు…
ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. గత మూడు రోజులుగా టీడీపీ నేతలు, వైసీపీ నేతలు మాటలతో యుద్ధ చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు కౌంటర్ ఇచ్చారు. పదవి దిగాక గౌతమ్ సవాంగ్ పరిస్థితేంటో ఆలోచించుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సీఎం జగన్ ఏదో అంటే బీపీ వచ్చి పార్టీ కార్యాలయంపై దాడి చేశారంట.. గతంలో చంద్రబాబును దుర్భాషలాడితే మాకూ బీపీ రాలేదనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. ‘తాడేపల్లి కొంపను కూల్చాలని…