ఏపీ ప్రభుత్వం ఆ విషయాన్ని దాచిపెట్టింది : నారా లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల్, డీజిల్ పై పన్ను భారాన్ని తగ్గించేది లేదంటూ ప్రజా ధనంతో ప్రకటనలు ఇచ్చుకొని దోచుకుంటున్న ఘనుడు దేశ చరిత్రలో జగన్ ఒక్కడే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు 23 రాష్ట్రాలు పన్ను భారాన్ని తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించినా ఏపీ మాత్రం బాదుడు విషయంలో వెనక్కి తగ్గనంటోంది. అసత్య ప్రకటనలతో ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నించి వైసీపీ ప్రభుత్వం అభాసు పాలయ్యింది. చంద్రబాబు హయాంలో ప్రజల పై భారాన్ని తగ్గించడానికి రూ.4 వ్యాట్ ని రూ.2కి తగ్గించిన విషయాన్ని దాచిపెట్టింది ప్రభుత్వం. యానాం వెళ్లి పెట్రోల్ కొట్టించుకుంటే తేడా తెలుస్తుంది అంటూ చిలక పలుకులు పలికిన జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు అయినా వ్యాట్ ఎందుకు తగ్గించలేదు అని ప్రశ్నించారు. కేవలం రూ.1 సెస్ వేసామంటూ అసత్యాలు చెబుతున్నారు. 2020 ఫిబ్రవరి 29న పెట్రోలుపై అదనపు వ్యాట్‌ను రూ.2.76, డీజిల్‌పై రూ.3.07 కు పెంచారు. 2020 జులై 20న, మరోసారి పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.4 వరకూ అదనపు వ్యాట్ పెంచుతూ ఆదేశాలు ఇచ్చారు. 2020 సెప్టెంబరు 18న, రోడ్డు అభివృద్ధి సెస్ పేరిట లీటరు రూ.1 చొప్పున విధించారు.. మళ్లీ దానిపైనా వ్యాట్ ఉంది. మొత్తంగా, లీటర్ పెట్రోల్ పై రూ.30 వరకూ, డీజిల్ పై రూ.22 వరకూ పన్నులు రూపంలో బాదుతున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే, పెట్రోల్ పై రూ.7.59, డీజిల్ పై రూ.5.46 వరకు పన్నులు రూపంలో ప్రభుత్వం అధికంగా బాదేసిందని కేంద్రమే చెప్పింది.
Also Read
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
తాజావార్తలు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!