ఏపీలో టీడీపీ నేతల అరెస్టుల పర్వ కొనసాగుతోంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహదేవ సందీప్ నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా హై డ్రామా చోటుచేసుకుంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో తిడుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసారని పోలీసులు కేసు నమోదు చేశారు. సందీప్ నాయుడు పై చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు.
వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన చిత్తూరు టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరులో సందీప్ నాయుడు ని అరెస్ట్ చేసిన పోలీసులు… తర్వాత జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. చివరకు పూతలపట్టు పోలీస్ స్టేషన్ నుంచి చిత్తూరుకు తరలించారు పోలీసులు. నోటీసులు లేకుండా అరెస్టు చేశారని సందీప్ కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. సందీప్ ఆచూకీ తెలపడంలేదని పోలీసులపై మండిపడుతున్నారు. ఇప్పటికే టీడీపీ నేత పట్టాభిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి తరలించిన సంగతి తెలిసిందే. ఆయనకు కోర్ట్ కూడా బెయిల్ మంజూరు చేసింది.