వైసీపీ పెద్దల చేతి వాటం కారణంగా రాష్ట్రంలో చీకట్లు కమ్ముకున్నాయి అని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అన్నారు. యూనిట్ రూ.20కి ప్రైవేటు సంస్థల నుండి కొనుగోలులో మర్మమేంటి అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో 22.5 మిలియన్ యూనిట్ల లోటును అధిగమించి మిగులు విద్యుత్ సాధించాం అని గుర్తు చేసారు. ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు జగన్ ప్రభుత్వం రూ.12 వేల కోట్ల బకాయిలు ఉంచింది అన్నారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల…
సీఎం జగన్ చేతకానితనంతో, అవినీతి ధన దాహంతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఓ వైపు విద్యుత్ బిల్లుల మోతలు, మరో వైపు విద్యుత్ కోతలతో ప్రజలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. కరెంట్ ఉత్పత్తి చేయటం చేతకాక సాయంత్రం 6 నుంచి 10 వరకు ఏసీలు ఆపు చేయమంటున్నారు. మరో నెల ఆగితే వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది…
టీడీపీ పార్టీ నేతలతో అధినేత చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసారు. ప్రభుత్వ విధానాలు.. చేపట్టాల్సిన ఆందోళనా కార్టక్రమాలపై చర్చ జరిపారు. రైతు, వ్యవసాయ సమస్యలపై నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటనలు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రైతు సమస్యలను ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందన్న టీడీపీ నేతలు… విశాఖలో ప్రభుత్వ ఆస్తుల తనఖాపై ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. ఆర్థికపరమైన అంశాల్లో ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతోందన్న చంద్రబాబు… ఏపీలోని డ్రగ్స్ మాఫియాపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని…
ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత ధూళిపాళ నరేంద్ర లేఖ రాసారు. ఇది రైతు ప్రభుత్వమా..? దగా ప్రభుత్వమా అంటూ ధూళిపాళ బహిరంగ లేఖలో ప్రశ్నించారు. ఆ లేఖలో… విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించడం ద్వారా రైతుల్ని దొంగల్లా చూస్తున్నారన్న భావన కల్పిస్తున్నారు. రైతు భరోసా అమల్లో కులం పేరు చెప్పి లబ్దిదారుల్లో కోత విధించారు. రైతు భరోసా లబ్దిదారులను 64 లక్షల నుంచి 45 లక్షలకు కుదించారు. 15 లక్షల కౌలు రైతులకు రైతు భరోసా…
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది గతంలో ఎన్నడూ రీతిలో కేవలం 23సీట్లకే పరిమితమైంది. ఆ ఓటమి నుంచి కోలుకోవడానికి చంద్రబాబుకు చాలా సమయమే పట్టింది. ఇదే సమయంలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో చంద్రబాబు ఇంటికే పరిమితమయ్యారు. దాదాపు ఏడాదిన్నరగా చంద్రబాబు యాక్టివ్ గా పని చేసిన దాఖలాల్లేవు. ఏదో మొక్కుబడిగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకానీ టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపే కార్యక్రమాలు పెద్దగా చేయలేదు. అయితే ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో…
ఏపీలో ఏక పక్షంగా జరిగిన ఎన్నికలు స్థానిక ఎన్నికలు జరిగాయి. మేము ఆ ఎన్నికలని బాయ్కాట్ చేసాము అని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. వైసిపి పార్టీ వాళ్లకి నేరాలు-ఘోరాలు చేయడం అలవాటు. ఇప్పుడు కూడా వైసిపి వాళ్ళు ఏమి చేయలేరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. నేను…
పోలీసులతో నాకు ప్రాణహాని ఉంది అని చింతమనేని ప్రభాకర్ అన్నారు. తాజాగా మీడియా సమావేశంలో చింతమనేని మాట్లాడుతూ.. నాకు సీఆర్పీఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా. నాపై అక్రమ కేసులు పెట్టడమే మీ ఫ్రెండ్లీ పోలీసింగా అని ప్రశ్నించారు. అక్రమ కేసులు సినిమా చూపించటంలో డీజీపీ రాంగోపాల్ వర్మను మించిపోయారు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక నేరగాళ్లు ఎందరో ఉండగా మీడియా సమావేశంలో నాపేరే డీజీపీ ఎందుకు ప్రస్తావించారు అని ప్రశ్నించారు. 6093 ఆర్థిక నేరగాడి…
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ, టీడీపీ మధ్య సవాళ్ల యుద్ధం నడుస్తుంది. అయితే ఎమ్మెల్యే అమర్నాథ్ ఛాలెంజ్ కు కౌంటర్ ఇచ్చారు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు తెలుగు దేశం పార్టీకి మాత్రమే ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి పై చర్చించడానికి, సవాల్ చేయడానికి టీడీపీ సిద్దం అన్నారు. విశాఖపట్నం పునర్నిర్మాణం జరిగింది అంటే అది చంద్రబాబు చొరవతోనే. కానీ తెలుగు దేశం పార్టీ వద్ద రాజకీయాలలో ఓనమాలు నేర్చుకున్న అమర్నాథ్…
ఏపీ తాలిబన్ రాజ్యంగా మారింది. పోలీసుల గన్నులు పెట్టి జగన్ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు అని టీడీపీ నేత కూన రవికుమార్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడే మహిళలకు రక్షణ లేకుండా పోయింది.ప్రతిపక్ష పార్టీగా మాకు నిరసన చేసే హక్కులేదా… నిరసనలు ,పరామర్శలు చేస్తే అరెస్టులు చేసేస్తారా అని ప్రశ్నించారు. నారా లోకేష్, ఇతర టీడీపీ నేతలు చేసిన తప్పేంటి. అసలు రాష్ట్రంలో దిశ చట్టం ఉందా.. అమల్లోకి వచ్చిందా అని అడిగారు. ముఖ్యమంత్రికి పిచ్చిపట్టి ఏం మాట్లాడితే,…
కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతుందని పరిశీలనకు వెళ్తున్న టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేయడం దౌర్భాగ్యం అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. మైనింగ్ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసిన నాయకులను ఎనిమిది మందిని అరెస్టు చేశారు. తేదేపా పార్టీ ఆఫీస్ కి వెళుతుండగా దౌర్జన్యంగా అరెస్టు చేసి మంగళగిరి నుంచి కొల్లిపర తీసుకు రావడంలో అర్థం ఏంటి. మైనింగ్ లో తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం ఏముంది. తప్పు చేస్తున్నారు కాబట్టి…