TDP Leader: బాలిక ఆత్మహత్య కేసు.. టీడీపీ నేత వినోద్ కుమార్ జైన్‌కు జీవిత కాల శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Leader: బాలిక ఆత్మహత్య కేసులో టీడీపీ నేత వినోద్‌కుమార్ జైన్‌కు జీవిత కాల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. సెక్షన్ 305 కింద జీవితకాల జైలుశిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పోక్సో యాక్ట్ 9,10 సెక్షన్ల కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. గత ఏడాది భవానిపురంలో టీడీపీ నేత లైంగిక వేధింపులు తాళలేక అపార్ట్‌మెంట్ నుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో టీడీపీ నేత వినోద్ కుమార్ జైన్‌కు జీవితకాల జైలు శిక్ష , రూ.3లక్షల జరిమానా న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. ఈ కేసులో బాధితుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుజ్జుల నాగిరెడ్డి వాదనలు వినిపించారు.
Read Also: AP Bhavan: ఏపీ భవన్ విభజనపై ముగిసిన ఉన్నతాధికారుల భేటీ.. వారం రోజుల్లో మరోసారి..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుజ్జుల నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..”ఫోక్సో కోర్టులో వినోద్ జైన్‌కు పోక్సో కోర్టులో శిక్ష వేశారు. రూ.3 లక్ష రూపాయలు బాధిత కుటుంబాలకు ఇవ్వాలని ఆదేశించారు. లోటస్ లెజెండ్ అపార్ట్‌మెంట్‌లో బాలికను వినోద్ జైన్ వేధింపులకు గురి చేశారు. ఎవరికి చెప్పలేని విధంగా బాలికను లైంగికంగా వేధించారు.సూసైడ్ నోట్లో వినోద్ జైన్ అక్రమాలపై బాలిక స్పష్టంగా రాసింది. రెండూ పేజీల లేఖలో నిందితుడి అకృత్యాలను వెల్లడించింది. బాలిక మరణంతో బాధిత కుటుంబ సభ్యులు నేటికీ కోలుకోలేకపోతున్నారు. నగర పోలీసులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. 2021 ఎన్నికల్లో టీడీపీ తరపున కార్పొరేటర్‌గా వినోద్ జైన్ పోటీ చేశారు. సమాజంలో పెద్ద మనిషిగా తిరుగుతూ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. పోలీసులు కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడికి శిక్ష పడింది.” అని బాధితుల తరఫున వాదనలు వినిపించిన నాగిరెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..