Varla Ramaiah: జైళ్ల శాఖ డీజీకి వర్ల రామయ్య లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జైళ్ళ శాఖ డీజీకి లేఖ రాశారు. న్యాయమూర్తి ఆదేశాలు లేకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ ఎమ్మెల్సీ అనంతబాబుకు వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పెద్ద నేరస్తుడికి రాజమండ్రి సెంట్రల్ జైలు సిబ్బంది, అధికారులు స్టార్ హోటల్ సౌకర్యాలు కల్పిస్తున్నారు.
రిమాండ్ ఖైదీకి అటువంటి సౌకర్యాలు కల్పించేందుకు అనుమతి ఇవ్వలేదని కోర్టు అధికారులు చెప్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా అనంతబాబుకు ప్రత్యేక గది కేటాయించి, రెండు సెల్‌ఫోన్లతో నిత్యం బాహ్య ప్రపంచంతో సంభాషిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతబాబును కలిసేందుకు ఎలాంటి రికార్డులు లేకుండానే సందర్శకులను అనధికారికంగా భారీ సంఖ్యలో అనుమతిస్తున్నారు. రాజమండ్రి స్టార్ హోటల్ నుంచి అనంతబాబుకు రోజూ భోజనం వస్తోందన్నారు వర్ల రామయ్య.
Also Read
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్‌డిస్క్‌లు మార్చారా..?
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్‌కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
అనంత బాబు జైలునే కేంద్రంగా మార్చుకుని పలు వివాదాలకు పంచాయతీలు చేస్తున్నాడని రామయ్య ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తోన్న జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య జైళ్ల శాఖ డీజీని లేఖలో కోరారు. డ్రైవర్ సుబ్రహ్యణ్యం హత్యకేసులో నిందితుడైన అనంతబాబు జైలులో వున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
UP: టోల్ బూత్‌ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
-
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
-
PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
-
AB De Villiers: బీసీసీఐ పెద్ద తప్పు చేసింది.. టీమిండియా ఆలోచన సరైంది కాదు!
-
Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్‌ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!