Tammineni Sitaram: అది రైతుల యాత్ర కాదు.. బినామీ యాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tammineni Sitaram: అమరావతి రైతుల పాదయాత్రపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అది రైతుల యాత్ర కాదని.. బినామీ యాత్ర అని వర్ణించారు. పాదయాత్ర చేసేది రైతులు కాదని తాము తొలిరోజు నుంచి చెప్తున్నామని.. ముసుగువీరులు ఎవరో శాసనసభలోనే చెప్పామని తమ్మినేని సీతారాం గుర్తుచేశారు. 28వేల మంది వద్ద బలవంతంగా భూములు లాక్కొంటే పాదయాత్రకు ఎంత మంది వచ్చారో అందరూ చూశారన్నారు. ఐడెంటెటీ కార్డులు కేవలం 70 మందే పట్టుకుని వచ్చారంటే ఏమనాలని ప్రశ్నించారు. ఇది డ్రామా కాదా.. ఎవడి డ్రామా అని నిలదీశారు. ఐడీ కార్డులు చుపమంటే కళ్యాణమండపం నుంచి బయటకురాలేదని.. చంద్రబాబు ఒక హిడెన్ ఎజెండాతో ఈ తతంగం నడిపిస్తున్నారని విమర్శించారు.
ప్రపంచ రాజధాని అంటున్న చంద్రబాబుకు విశాఖ ఎందుకు గుర్తురాలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం సూటి ప్రశ్న వేశారు. రాజధానికి కావాల్సిన అన్ని హంగులు విశాఖకు ఉన్నాయన్నారు. ఒకటికి వెయ్యి రెట్లు భూముల రేటు పెంచాలనే ఇన్ సైడర్ ట్రేడ్ చేసి అమరావతిలో రాజధాని పెట్టారని ఆరోపించారు. రాష్ర్టంలో ప్రజలందరికీ, అన్ని వర్గాలకు రాజధాని అందుబాటులో ఉండాలన్నారు. కేవలం ఒక సామాజిక వర్గానికి మేలు చేసేందుకే సెంటర్లీ లొకేటెడ్ అంటున్నారని.. పోనీ అమరావతి కట్టారా అంటే గ్రాఫిక్స్ మాత్రమే చూపించారని ఎద్దేవా చేశారు. శివరామకృష్ణ రిపోర్టు, శ్రీభాగ్ ఒప్పందాలను బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు.
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
Read Also: Minister Slaps Woman: మహిళను చెంపదెబ్బ కొట్టిన మంత్రి.. వీడియో వైరల్..
అమరావతి ప్రాంతం రాజధాని పనికిరాదని శివరామకృష్ణ కమిటీ చెప్పిందని స్పీకర్ తమ్మినేని గుర్తుచేశారు. శివరామకృష్ణ కమిటీ జగన్ వేసిన కమిటీ కాదని.. కేంద్రప్రభుత్వం వేసిన కమిటీ అన్నారు. బ్యాంకులు దోచిన వారిని, విద్యను వ్యాపారం చేసిన వారిని చంద్రబాబు కమిటీలో వేశారని తమ్మినేని చురకలు అంటించారు. హైదరాబాద్ రాజధానిని ఎందుకు వదిలి అదరా బాదరాగా వచ్చేశారని ప్రశ్నించారు. అమరావతిని మేం రాజధాని కాదనటం లేదని.. కర్నూలు, విశాఖ కుడా అభివృద్ధి చేస్తామని చెబుతున్నామని స్పష్టం చేశారు. ప్రశాంతంగా ర్యాలీ చేయమని హైకోర్టు అనుమతి ఇస్తే.. తొడలు కొట్టడానికి.. రెచ్చగొట్టడానికి ప్రయత్నించడమేంటని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశం సర్వత్రా ఆమోదయోగ్యమన్నారు. ఇక్కడ జరిగిన ఉద్యమాలు ఎవరి కోసం, ఎందుకోసం జరిగాయో అందరికీ తెలుసన్నారు.
ఉత్తరాంధ్ర పొరాటంలో నాడు ఎందరో మేథావులు త్యాగాలు చేశారని.. నాడు ఎందరో మహానేతలు చేసిన ప్రాణత్యాగాలకు జగన్ న్యాయం చేయాలనుకుంటున్నారని తమ్మినేని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందితే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. నాడు భుస్వామ్య వ్యవస్థపై తిరగబడిందే సిక్కోల సాయుధ పోరాటం అన్నారు. నాటి పోరాటానికి కారణం పేదరికం , వెనుకుబాటుతనం అని గుర్తుచేశారు. నాయకుడు అంటే ఒక సామాజిక వర్గం కోసం కాదు సమాజం కోసం పనిచేయాలన్నారు. చంద్రబాబు మెకానిజం ఎవరిని మభ్యపెట్టడానికో చెప్పాలన్నారు. పండగ వస్తే ఉత్తరాంధ్ర వాసులు ఎక్కడికో వలస వెళ్లి తిరిగి వస్తుంటారని.. ఎన్నాళ్లు ఈ దుర్ఘతి.. దౌర్భాగ్యం ఉంటాయని.. ఎన్నాళ్లు ఈ అవస్థలు పడాలని తమ్మినేని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!