చంద్రబాబు అరెస్ట్ పై స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ దర్యాప్తు ఒక ఏజెన్సీ చేపట్టింది కాదు… ED, IT, GST, సెబీ వంటి సంస్థలన్ని చేపట్టాకే ప్రభుత్వం కన్ఫర్మ్ చేసిందని తెలిపారు. 2014లో చంద్రబాబు అధికారం చేపట్టిన రెండు నెలలకే ఈ స్కాం పురుడు పోసుకుందని చెప్పారు. ఈ స్కాంపై టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2017లో ACB కి ఫిర్యాదు వెళ్ళిందని.. విచారణ చేపట్టకుండా, అసెంబ్లీలో చర్చించకుండా తేలు కుట్టిన దొంగలులాగా దాన్ని పక్కన పెట్టేశారని విమర్శించారు. ఇది జరిగిన వెంటనే ప్రాజెక్ట్ నోట్ ఫైల్ ను మాయం చేశారని.. కేబినెట్ లో పెట్టింది ఒకటి.. బయట వీరు చేసిందొకటని స్పీకర్ సీతారాం మండిపడ్డారు.
Read Also: Chandrababu Arrest: కంటతడి పెట్టుకున్న నందమూరి రామకృష్ణ
సెక్రటరీస్, ఉన్నతాధికారులను ఓవర్ రూల్ చేసి కేబినెట్ లో నోట్ పెట్టడం నిబంధనలకు విరుద్ధమని సీతారాం తెలిపారు. సీమెన్స్ నుండి ఒక్క పైసా కూడా రాకుండా ఐదు విడతలుగా 375 కోట్లు ప్రభుత్వం ఎలా రిలీజ్ చేసిందని ప్రశ్నించారు. ఆర్ధిక శాఖ కొర్రీలు పెడితే చంద్రబాబు ఆదేశాలతో నిధులు రిలీజ్ చేసినట్లు అప్పటి ఫైనాన్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నోట్ ఫైల్ లో పేర్కొన్నారని తెలిపారు. విడుదలైన ఆ నిధులు ఏమయ్యాయి.. ఏ ముసుగు వీరుడు దీనిని అందుకున్నాడని ప్రశ్నించారు. MOU కి తమకు సంబంధం లేదని సీమెన్ సంస్థ కూడా164 CRPC కింద మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిందని తెలిపారు. GST పూర్తి విచారణ చేపడితే డబ్బులు హవాలా పద్దతిలో వచ్చాయని తేలిందని స్పీకర్ పేర్కొన్నారు.
Read Also: Ambati Rambabu: చంద్రబాబుది అక్రమ అరెస్టు కాదు.. అనివార్యమైన అరెస్టు
14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే విచారణ సంస్థలు గుడ్డిగా వెళ్ళిపోవని స్పీకర్ అన్నారు. చట్టంకి ఎవరూ చుట్టం కాదని తెలిపారు. విచారణను ఫేస్ చేయమనండి.. నిప్పో, ఉప్పో, తుప్పో తేలుతుందని విమర్శించారు. ప్రజాధనాన్ని దోపిడీ చేసిన వ్యక్తిని ఆర్థిక నేరస్థుడుగా అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తది అనుకుంటే అది దురదృష్టమన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై ప్రజలు రోడ్లపైకి వచ్చి, చొక్కాలు చింపుకొనే అంత సీన్ లేదని.. భయంతో మనోవేదనతో గిల్టీగా ఫీల్ అయ్యే తన అరెస్ట్ పై చంద్రబాబు ముందే చెప్పాడని స్పీకర్ తెలిపారు.