300 Years Old Idols Recovered in tamil nadu: ఎంతో విలువైన, అరుదైన దేవతా విగ్రహాలు తమిళనాడులో ఓ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు ఐడల్ వింగ్ పోలీసులు. స్వాధీనం చేసుకున్న విగ్రహాలు దాదాపు 300 ఏళ్ల పాతవని గుర్తించారు. చెన్నైలో ఉంటున్న ఓ వ్యక్తి పురానత విగ్రహాలను ఉన్నాయనే రహస్య సమాచారంతో తమిళనాడు పోలీస్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ రెండు విగ్రహాలు పట్టుబడ్డాయి.
కూర్చున్న భంగిమలో ఉన్న మరియమ్మన్ విగ్రహంతో పాటు, నాట్యం చేస్తున్న నటరాజన్ విగ్రహాలు దొరికాయి. రెండు విగ్రహాలు కూడా అత్యంత పురాతమైనవిగా.. వీటికి అంతర్జాతీయ మార్కెట్ లో కోట్ల విలువ ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎవరి ఇంట్లో విగ్రహాలు దొరికాయో.. అందులో నివసిస్తున్న మహిళ తను పట్టకుముందు నుంచే ఈ విగ్రహాలను తమ తల్లిదండ్రులు కలిగి ఉన్నారని వెల్లడించింది. ఈ విగ్రహాలు ఎక్కడివో ఆమెకు తెలియలేదు. దీంతో విగ్రహాలకు సంబంధించిన కాగితాలను అధికారులు అడిగినప్పుడు ఆమె వాటిని ఇవ్వలేకపోయింది.
Read Also: Ireland: ఐర్లాండ్ లో ఇద్దరు కేరళ యవకుల దుర్మరణం..
అయితే విగ్రహాల కింది భాగంలో ఆలయ పల్లకిలో అమర్చడానికి, పండగ సందర్భంలో వాటిని తీసిన గుర్తులు ఉన్నట్లు గుర్తించారు. ఖచ్చితంగా ఇవి ఆలయవిగ్రహాలనే అని పోలీసులు తేల్చారు. ఇవి పురాతన విగ్రహాలని.. బహుశా దేశాలయాల నుంచి దొంగలించి.. ప్రస్తుతం విగ్రహాలు దొరికిన వ్యక్తికి అమ్మవచ్చని ఐడల్ వింగ్ పోలీసులు భావిస్తున్నారు. సరైన ఆధారాలు లేకపోవడం వల్ల ఈ రెండు విగ్రహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా విగ్రహాలు ఎక్కడివో గుర్తించే పనిలో పడ్దారు పోలీసులు. ఆలయాల్లో ఎక్కడెక్కడ విగ్రహాలు చోరీ అయ్యాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.