సంక్రాంతి పండుగ వేళ ప్రజలకు శుభవార్త చెప్పారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. సంక్రాంతి పండుగ సందర్భంగా పొంగల్ గిఫ్ట్ అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు.. రేషన్ కార్డ్ దారులకు వెయ్యి రూపాయల నగదు పాటు.. ఒక కేజీ చక్కెర, కేజీ బియ్యం కానుకగా అందిస్తున్నారు.. తమిళనాడులోని 2.19 కోట్లమందికి ఈ పండుగకు ప్రయోజనం చేకూరనుంది.. రేషన్ కార్డ్ హోల్డర్లు అందరూ దీనికి అర్హులు.. ఇది శ్రీలంక పునరావాస శిబిరాల్లో నివసిస్తున్న కుటుంబాలకు కూడా వర్తిస్తుంది. ఒక్కో కేజీ బియ్యం,…
Rope from truck wraps biker's neck in freak road accident in Tamil Nadu: ఆవగింజంత అదృష్టం ఉన్నా చాలు ఎంతటి విపత్తుల నుంచైనా తప్పించుకోవచ్చు. ఎలాంటి ప్రమాదాల్లో అయినా సురక్షితంగా ఉండొచ్చు. సరిగ్గా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. తమిళనాడు తూత్తుకుడిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అద్భుతరీతిలో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే తూత్తుకూడిలో ఎదురెదురుగా లారీ, బైకు వస్తున్న క్రమంలో లారీకి వేలాడుతున్న తాడు యువకుడి మెడకు చుట్టుకుంది.…
MK Stalin's Son, Udhayanidhi, Joins His Cabinet As Sports Minister: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ కేబినెట్ లో చేరారు. మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సీఎం ఎంకే స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని చేపాక్ - తిరువల్లికేణి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంకే స్టాలిన్ రాజకీయ వారసుడిగా ఉదయనిధిని డీఎంకే పార్టీ భావిస్తోంది. ఉదయనిధి స్టాలన్ ఎప్పటి నుంచో…
డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు తమిళనాడు కేబినెట్‌లో అవకాశం లభించింది.. ఈ నెల 14వ తేదీన ఉదయనిధి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.. 45 ఏళ్ల ఎమ్మెల్యే మరియు సినీ నటుడైన ఉదయనిధి.. డిసెంబర్ 14న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. చేపాక్-తిరువల్లికేని అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయనిధికి యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి, ప్రత్యేక కార్యక్రమాల అమలు వంటి శాఖలు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. ఉదయనిధికి మంత్రి పదవిపై చాలా…
వాయుగుండంగా కొనసాగుతోంది మాండూస్ తుఫాన్. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై తుఫాన్ ప్రభావం పడింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్ తుఫాను రోజురోజుకూ మరింత బలంగా దూసుకొస్తోంది. దీనిపై వాతావరణ అధికారులు వేస్తున్న అంచనాలు మాటిమాటికీ మారిపోతున్నాయి. నిన్న తీరం దాటుతుందని అంచనా వేయగా.. తాజాగా ఈ లెక్క మారింది. ప్రస్తుతం ఉత్తర తమిళనాడుకి దగ్గరలో ఉన్న ఈ తుఫాను.. శనివారం ఉదయం శ్రీహరికోట - పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Annamalai criticized Udayanidhi Stalin as a playboy: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఉదయనిధి స్టాలిన్ ను ఉద్దేశిస్తూ..‘క్రౌన్ ప్రిన్స్ ప్లే బాయ్ గానే మిగిలిపోతాడు’ అంటూ వ్యాఖ్యానించారు. ఉదయనిధి కోసం ఎంత డబ్బు ఖర్చు చేసినా.. ప్లేబాయ్ గానే మిగిలిపోతాడంటూ విమర్శించారు. అన్నూర్ జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న అన్నామలై, డీఎంకే టార్గెట్…
Madras High Court Bans Mobile Phones In Temples Across Tamil Nadu: దేవాలయాల్లో మొబైల్ ఫోన్లను బ్యాన్ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ హైకోర్టు. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధాన్ని విధించింది. దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు తమిళనాడులోని అన్ని దేవాలయాల్లో మొబైల్ ఫోన్లను నిషేధించాలని మద్రాస్ హైకోర్టు మదురై బేంచ్ హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ శాఖను ఆదేశించింది.
Python attack on a Man.. Incident in Tamil Nadu: తమిళనాడులో ఓ వ్యక్తిపై కొండచిలువ దాడి చేసింది. ఎవరూ చూడకపోయుంటే ప్రాణాలు పోయేవే. అయితే లక్కీగా దాడి జరిగిన సమయంలో మిగతా ప్రజలు ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఏకంగా గంటపాటు కొండచిలువతో పోరాటం కొనసాగింది. వ్యక్తి కాలుకు చుట్టుకున్న కొండచిలువను వదిలించేందుకు గంట పాటు రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది అధికారులు పోరాటం చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.