Extramarital Affair :చెన్నైలోని ఎక్కదూతంగల్ ప్రాంతంలో దారుణం జరిగింది. తమ వివాహేతర సంబంధం వదులుకోవాల్సి వస్తుందేమోనన్న భయంతో ప్రియురాలి భర్తను చంపాడో ఓ వ్యక్తి. 33 ఏళ్ల పీ వెల్దురై అలియాస్ శంకర్ పెయింటింగ్ పని చేస్తూ చెన్నైలో ఉంటున్నాడు. తిరునెల్వేలి జిల్లాకు చెందిన మహిళతో అతడికి పెళ్లి అయ్యింది. పుట్టింట్లో ఉంటున్న ఆమెకు 37 ఏళ్ల వీరబుధిరన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు భర్తకు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న శంకర్ తన భార్యను చెన్నైకి రమ్మని కోరాడు. ఆ మహిళ చెన్నై వెళితే తనతో ఉన్న వివాహేతర సంబంధం ముగుస్తుందని భావించాడు. దీంతో ఆమె భర్తను కలిసేందుకు చెన్నై వెళ్లాడు. ఆదివారం విరుదునగర్ జిల్లాకు చెందిన వీరబుధిరన్ చెన్నైకి చేరుకున్నాడు. శంకర్ నగరంలోని గిండీ ప్రాంతంలో వీరిద్దరూ కలుసుకున్నారు. మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. వీరబుధిరన్ తన వెంట తీసుకెళ్లిన కత్తితో శంకర్‌ను పొడిచాడు. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Read Also: Covishield Doses : రెండు కోట్ల కోవిషీల్డ్ డోసులు కేంద్రానికి ఫ్రీగా ఇచ్చిన సీరమ్ ఇనిస్టిట్యూట్
ఇంతకుముందు, నవంబర్‌లో ఇలాంటి సంఘటన కోయంబత్తూరులో జరిగింది. తన కోరికకు వ్యతిరేకంగా వితంతువును పెళ్లి చేసుకోవడానికి తమ్ముడిని హత్య చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. బాలమురుగన్ మరియు ఎం బాలసుబ్రహ్మణ్యం సోదరులు. 25 ఏళ్ల వితంతువుతో బాలసుబ్రహ్మణ్యం పెళ్లి చేసుకున్నారు. మహిళకు అంతకు ముందే ఒక బిడ్డ ఉన్నందున అన్నయ్య ఆ పెళ్లి వద్దన్నాడు. దీంతో ఆగకుండా అక్కడున్న ఆయుధంతో తమ్ముడి తలపై కొట్టి హత్య చేశాడు.