Tamil Nadu Sees ‘Madras Eye’ Surge, 1.5 lakh Conjunctivitis Cases In Monsoon: తమిళనాడు వ్యాప్తంతా ‘ మద్రాస్ ఐ ’ కేసుల సంఖ్య పెరుగుతోంది. సాధారణ భాషలో చెప్పాలంటే ‘ కళ్ల కలక’గా ఈ వ్యాధిని వ్యవహరిస్తుంటారు. ఇప్పటి వరకు తమిళనాడు వ్యాప్తంగా 1.5 లక్షల కళ్లకలక కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడు వ్యాప్తంగా ఈశాన్య రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజల్లో ఇన్ఫెక్షన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా…
Mangaluru Autorickshaw Blast: మంగళూరు ఆటోరిక్షా పేలుడు కేసులో ‘‘యాక్ట్ ఆఫ్ టెర్రర్’’గా పేర్కొన్నారు కర్ణాటక పోలీసులు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మంగళూర్ నగరంలో శనివారం ఆటోరిక్షాలో పేలుడు సంభవించింది. అయితే ఇది ప్రమాదవశాత్తు పేలిన సంఘటన కాదని.. తీవ్ర నష్టం కలిగించే ఉద్దేశం ఇందులో ఉందని రాష్ట్ర డీజీపీ ప్రవీణ్ సూద్ ఆదివారం అన్నారు. ఇందులో ఉగ్రకుట్ర ఉన్నట్లుగా ఆయన ధృవీకరించారు. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలకు కర్ణాటక పోలీసులు సహకరిస్తున్నారని…
Physical assault on minor girl in Tamil nadu: తమిళనాడులో ఘోరం జరిగింది. మైనర్ బాలికపై దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు ఐదుగురు దుర్మార్గులు. సామూహిక లైంగికదాడికి పాల్పడటంతో పాటు బ్లాక్ మెయిల్ చేస్తూ బాలికకు నరకం చూపించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో తిరుచ్చిలో జరిగింది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడేలా చేసింది ఆమెకు బంధువే. బంధువుతో పాటు మరో నలుగురు వ్యక్తులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Rajiv Gandhi assassination case: సుప్రీంకోర్టు ఆదేశాలతో రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు తమిళనాడు జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. నళినితో పాటు మరో ఐదుగురు వెల్లూరు, మధురై జైళ్ల నుంచి విడుదల అయ్యారు. ఆదివారం నిందితుల్లో ఒకరైన నళిని శ్రీహరన్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు తనకు సహాయపడిన వారందరికి థాంక్స్ చెప్పారు. ఇదిలా ఉంటే గతంలో ప్రియాంకా గాంధీ వాద్రా కలిసిన సమయంలో జరిగిన సంఘటనలను వివరించారు.
Rajiv Gandhi Assassination convicts leaves jail: సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న నళిని శ్రీహరన్ తో పాటు మరో ఐదుగురు తమిళనాడు వేల్లూరు జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. నళినితో పాటు శ్రీహరన్, సంతన్, మురుగన్, రాబర్ట్ పాయస్, ఆర్పీ రవిచంద్రన్ విడుదలైన వారిలో ఉన్నారు. 31 ఏళ్ల పాటు నిందితులు జైలు శిక్ష అనుభవించారు. శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పుతో వీరందరికి ఊరట లభించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుపై…
5 Killed In Fire At Fireworks Godown In Madurai: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా గోడౌన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన గురువారం మధురై జిల్లాలోని తిరుమంగళం లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశాయి. అయితే ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా సింధుపట్టి…
అన్న కోసం కొందరు తమ్ముళ్లు ఏది చేసేందుకైనా సిద్ధపడతారు.. ఆస్తులు త్యాగం చేసేవాళ్లు కొందరైతే.. అన్నపై ఈగ కూడా వాలకుండా చూసుకునేవారు మరికొందరు.. అయితే, జైలులో ఉన్న తన అన్న కోసం ఏకంగా గంజాయి బిస్కెట్లు తయారు చేసి.. అన్నను ములాకత్లో కలిసి పరామర్శించి.. తాను తయారు చేసి గంజాయి బిస్కెట్లను అన్నకోసం పంపించి అడ్డంగా దొరికిపోయాడు ఓ తమ్ముడు.. చివరకు అరెస్టై.. అన్న ఉన్న జైలులోనే ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.. Read Also: Gujarat…
physical assault on 10th class girl in tamil nadu: దేశంలో ప్రతీరోజు ఎక్కడో చోట అత్యాచారం, లైంగిక వేధింపుల సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వావీవరస, చిన్నాపెద్ద తేడా లేకుండా మృగాళ్లు బరితెగిస్తున్నారు. తాజాగా తమిళనాడులో 10వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి.. దాన్ని వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేశాడు.
Upset over not being allowed to marry her cousin, college girl kills self in TN’s Cuddalore: తమిళనాడు రాష్ట్రం కడలూరులో విషాద సంఘటన జరిగింది. తన మేనమామ కొడుకుని పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కడలూరులో ఓ కాలేజీ చదువుకుంటున్న యువతి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. తన బావతో వెంటనే పెళ్లి చేయాలని యువతి కోరింది. అయితే చదువు ముగిసిన తర్వాత పెళ్లి…
Refrigerator blast in tamil nadu: ఇంట్లో అవసరాల కోసం ఉపయోగించే ఫ్రిజ్లు, గీజర్ల వంటి ఎలక్ట్రిక్ వస్తువులు ప్రాణాలను తీస్తున్నాయి. ఇటీవల హైదరాబాల్ లో ఇద్దరు వైద్యులు గీజర్ పేలుడుతో చనిపోయారు. ఈ ఘటనల జరిగిన కొన్ని రోజులకు మరో ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులో ఓ ఇంట్లో ఫ్రిజ్ పేలి ముగ్గురు మరణించారు. ఈ ఘటన చెంగల్పట్టు జిల్లా ఊరప్పాకలో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో అక్కడ విషాదం నెలకొంది.