KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్‌కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
- గ్లోబరీనా ఆరోపణలపై డిఫమేషన్ నోటీసు
- లై డిటెక్టర్ పరీక్షకు కేటీఆర్ సవాల్
- కాంగ్రెస్-బీజేపీపై తీవ్ర విమర్శలు
- పాదయాత్రపై కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : వరంగల్‌లో నిర్వహించిన చిట్ చాట్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గ్లోబరీనా సంస్థ తనదంటూ చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డికి డిఫమేషన్ నోటీసులు పంపినట్లు ఆయన వెల్లడించారు. ఆ నోటీసుకు సరైన సమాధానం ఇవ్వకపోతే న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గ్లోబరీనా సంస్థతో తమకేమీ సంబంధం లేదని స్పష్టం చేస్తూ, ఒకవేళ అది తన సంస్థే అయితే ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం ఆ సంస్థతో ఒప్పందం ఎందుకు కుదుర్చుకుందో చెప్పాలని నిలదీశారు. విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని, దమ్ముంటే విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. అవసరమైతే ఇద్దరం లై డిటెక్టర్ పరీక్షకు వెళ్దామని, దానికి సీఎం సిద్ధమా అని సవాల్ విసిరారు.
రేవంత్ పాలన, బీజేపీతో అంతర్గత బంధంపై ధ్వజం
రేవంత్ రెడ్డి మనస్ఫూర్తిగా ఒక్కసారి కూడా ‘జై తెలంగాణ’ అని అనలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పాత కేసుల బూజు దులుపుతారనే భయంతోనే రేవంత్ రెడ్డి బీజేపీని, ప్రధాని మోదీని ఏమీ అనలేకపోతున్నారని ఆరోపించారు. సింగరేణిలో భారీ కుంభకోణాలు జరుగుతున్నా బీజేపీ మౌనంగా ఉంటోందని మండిపడ్డారు. పగలు కాంగ్రెస్, రాత్రి బీజేపీగా వ్యవహరించే నైజం రేవంత్ రెడ్డిదని, ఢిల్లీకి వెళ్తే బీజేపీ నేతల కార్లలో తిరుగుతారని తీవ్ర విమర్శలు చేశారు. తమది ‘తెలంగాణ జాతి’ అని, బ్యాగులు మోసే జాతి లేదా దగుల్బాజీ జాతి కాదని స్పష్టం చేశారు. అర్ధరాత్రి కాళ్లు పట్టుకునే దుస్థితి తమకు అలవాటు లేదని వ్యాఖ్యానించారు.
Also Read
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
- Bhatti Vikramarka : తెలంగాణలో పెట్టుబడులకు అండగా ఉంటాం..
- Telangana Studies: వియత్నాం విద్యా మోడల్‌పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
అవినీతి ఆరోపణలు , రాబోయే రాజకీయ కార్యాచరణ
రేవంత్ రెడ్డి బావమరిది అమృత్ కాంట్రాక్టుల్లో తీవ్ర కుంభకోణానికి పాల్పడుతున్నారని, అందులో నుంచి కాంగ్రెస్‌కు ఒక మూట, బీజేపీకి రెండు మూటలు పంపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. గ్లోబరీనా, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్ వంటి ఏ అంశంపైనా కేసులు పెట్టుకోవచ్చని, తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గ్లోబరీనా సంస్థ తనదేనని నిరూపిస్తే రాహుల్ గాంధీతో వచ్చి తన ఇంటి ముందు ధర్నా చేయాలని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి బాధ్యతారాహిత్య మాటలు మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో జిల్లాల నుంచే తమ పాదయాత్ర ప్రారంభమవుతుందని, త్వరలోనే అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసేలా ముమ్మర రాజకీయ ప్రణాళికతో ముందుకు వెళ్తామని వెల్లడించారు.
తాజావార్తలు
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!