SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SBI: ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫౌండేషన్ శుభవార్త చెప్పింది. ఎస్బిఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ (SBI Platinum Jubilee Asha Scholarship Program) 2026 కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ స్కాలర్షిప్ కార్యక్రమాల్లో ఒకటైన ఈ పథకం ద్వారా ఈ ఏడాది రూ.100 కోట్ల విలువైన స్కాలర్షిప్లు అందించనున్నారు. దేశవ్యాప్తంగా 25,707 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. విద్యాభ్యాసానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా ప్రతిభావంతులైన విద్యార్థులకు సహాయం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని SBI ఫౌండేషన్ తెలిపింది.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఈ స్కాలర్షిప్ వివిధ విభాగాల విద్యార్థులకు అందుబాటులో ఉంది. అవేమంటే..
* 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు.
* డిగ్రీ (UG) విద్యార్థులు.
* పీజీ (PG) విద్యార్థులు.
* MBBS చదువుతున్న విద్యార్థులు.
* IITల్లో చదువుతున్న విద్యార్థులు.
* IIMల్లో చదువుతున్న విద్యార్థులు.
* విదేశాల్లో మాస్టర్స్ చేస్తున్న విద్యార్థులు.
Also Read
- RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
- Layoffs: లేఆఫ్స్ బాటలో డిస్నీ.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ పోటీ తట్టుకోలేక కీలక నిర్ణయం..
- November School Holidays: ఈనెలలో భారీగా సెలవులు.. ఏకంగా 8 నుంచి 13 రోజులు పాఠశాలలకు హాలిడేస్..
- School Holidays: తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
అర్హతలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గత విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులు లేదా 7.5 CGPA సాధించి ఉండాలి. ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు NAAC Grade A లేదా అంతకంటే మెరుగైన గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, NIRF 2025-26 టాప్-300 సంస్థలు, లేదా QS 2025-26 టాప్-200 విశ్వవిద్యాలయాల్లో చదువుతూ ఉండాలి. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం పాఠశాల విద్యార్థులకు రూ.3 లక్షలలోపు, అలాగే కాలేజీ విద్యార్థులకు రూ.6 లక్షలలోపు ఉండాలి. అయితే ప్రతి విభాగానికి సంబంధించిన పూర్తి అర్హత వివరాలను అధికారిక స్కాలర్షిప్ పోర్టల్‌లో ఒకసారి పరిశీలించాలని సూచిస్తున్నారు.
ఎంత స్కాలర్షిప్ లభిస్తుంది?
ఈ పథకం కింద రూ.15,000 నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్ అందించనున్నారు. విద్యార్థి చదివే కోర్సు, విభాగాన్ని బట్టి స్కాలర్షిప్ మొత్తం మారుతుంది. అర్హత నిబంధనలు కొనసాగిస్తే, కోర్సు పూర్తయ్యే వరకు ఆర్థిక సహాయం అందించేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు SBI ఫౌండేషన్ తెలిపింది.
దరఖాస్తు విధానం:
అర్హులైన విద్యార్థులు ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి. https://www.sbiashascholarship.co.in/auth?mode=signup వెబ్ సైట్ లో అప్లికేషన్ ను పూర్తి చేసుకోవాలి. ముందుగా SBI ఆశా స్కాలర్షిప్ అధికారిక పోర్టల్‌ను సందర్శించాలి. తాము దరఖాస్తు చేయాలనుకుంటున్న స్కాలర్షిప్ విభాగానికి సంబంధించిన అర్హతలను చూసుకున్న తర్వాత ఆన్లైన్ దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేయాలి. అందులో అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి దరఖాస్తును సమర్పించాలి. ఆ తర్వాత నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్‌కు సమాచారం అందుతుంది.
దరఖాస్తులకు చివరి తేదీ:
SBI Platinum Jubilee Asha Scholarship Program 2026కు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 4, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే అవసరమైన పత్రాలను సరిగా అప్లోడ్ చేయాలని, లేనిపక్షంలో దరఖాస్తు తిరస్కరించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్‌తో క్రికెట్ గాడ్..!
-
Janjatiya Gaurav Diwas: గిరిజనులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. జన్‌జాతీయ గౌరవ్ దివస్‌లో ప్రధాని మోడీ విమర్శలు
-
Ruturaj Gaikwad: బ్యాటింగ్‌లో ఫెయిల్.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు.. ఇంకో ఛాన్స్ వచ్చేనా?
-
CM Delhi Tour: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో కీలక భేటీ..!
-
Virat Kohli: అప్పుడు 18, ఇప్పుడు 21.5.. విరాట్ కోహ్లీ కెరీర్లోనే చెత్త వన్డే సిరీస్!
ట్రెండింగ్
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!