ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కేంద్రం ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ సర్వే నిర్వహిస్తోంది. ఇటీవల బీహార్‌లో చేపట్టి విజయవంతంగా ఎన్నికలు ముగిశాయి. త్వరలో తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌లో జరిగే రాష్ట్రాలపై ఈసీ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ప్రత్యేక ఓటర్ సర్వే నడుస్తోంది. ఇంకోవైపు ‘SIR’ నిలిపివేయాలంటూ మూడు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధార్ కార్డుతో చొరబాటుదారులను ఓటర్లుగా గుర్తించడమేంటి? అని ప్రశ్నించింది. ఆధార్ కార్డు అనేది పౌరసత్వానికి రుజువు కాదని వ్యాఖ్యానించించింది.
ఇది కూడా చదవండి: Supreme Court: ఢిల్లీ కాలుష్యంపై జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు
ఇక చొరబాటుదారులు ఆధార్ కార్డులు పొందుకోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన భారతీయుడు కాదని.. అలాంటప్పుడు ఓటు హక్కు ఎలా వస్తుందని ప్రశ్నించింది. సంక్షేమ పథకాల కోసం ప్రయోజనం ఉపయోగపడుతుంది కానీ.. ఓటు హక్కు కోసం కాదని పేర్కొంది. అనేక రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఇది కూడా చదవండి: Earthquake: ఇండోనేషియాను వణికించిన భారీ భూకంపం
ఆధార్ కార్డు పౌరసత్వం లేదా నివాస స్థలాన్ని ఇవ్వదని స్పష్టం చేస్తుంది. ఆధార్ అనేది కేవలం సంక్షేమ ప్రయోజనాలు పొందడానికేనని తెలిపింది. ఫారం-6 దరఖాస్తులో ఈసీ కోరిన పత్రాలు సమర్పించాల్సిందేనని.. ఎన్నికల సంఘం పోస్ట్ ఆఫీస్ కాదని పేర్కొంది.
ఇక పిటిషనర్ల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ‘SIR’పై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన భారాన్ని మోపుతుందని చెప్పారు. నిరక్షరాస్యులకు ఫారమ్ ఎలా పూర్తి చేయాలో.. ఎలా రాయాలో తెలియదు.. దీంతో ఫారమ్‌లు పూర్తి చేయడం చేతగాక పోవడంతో ఓటర్లను తొలగిస్తున్నారని తెలిపారు. ఇది కరెక్ట్ కాదని.. వెంటనే ‘సర్’ నిలిపివేయాలని కోరారు. తదుపరి విచారణను డిసెంబర్ 1కు వాయిదా వేసింది.